Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

9 న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నెల 9వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతం వైపు పయనించే అవకాశం ఉందని, అది మరింత బలపడి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

ALSO READ ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7,380 కోట్లకు 30 ఏళ్లపాటు ప్రైవేటుకు లీజుకు ఇవ్వడం దారుణం

దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం నల్గొండలో గరిష్ట ఉష్ణోగ్రత 38.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది.