Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
చర్ల మే 7 (నిజం న్యూస్) మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు లపై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.

పోలీసులపై ఉదయం పుట్టపాడు(కిష్టారం పిఎస్) అటవీ ప్రాంతంలో సుమారుగా 6 గంటల సమయంలో అకస్మాత్తుగా ఒక ఎత్తైన ప్రదేశం నుండి మావోయిస్టులు కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు.

ALSO READ: వచ్చే వారంలో ఇంటర్ ఫలితాలు

కొన్ని నిమిషాల పాటు మావోయిస్టులకు,పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.అనంతరం ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో రెండు మృతదేహాలు,ఒక ఎస్ ఎల్ ఆర్ ఆయుధం,ఒక సింగల్ బోర్ తుపాకీ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

రెండు మృతదేహాల్లో ఒకరు చర్ల ఎల్.ఓ.ఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య గా గుర్తించారు .మరొక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. మృత దేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు