కేటీఆర్ మామ… మా అమ్మకేది ఉద్యోగ ధీమా
పెన్ పహాడ్, ప్రతినిధి మే 6 నిజం న్యూస్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులరైజేషన్ చేయాలని మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద 9 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
అందులో భాగంగా శనివారం మండలంలోని నాగులపహడ్ జెపిఎస్ అసోసియేషన్ మండల ఉపాధ్యక్షురాలు దివ్యభారతి తమ పిల్లలతో కలిసి కూర్చున్నారు. ‘కేటీఆర్ మామ మా అమ్మకేది ఉద్యోగ ధీమా’ అని రాసి ఉన్న ప్లకార్డులను పిల్లలు ప్రదర్శించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
ALSO READ: పశువుల వాహనం పట్టివేత
తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అసోసియేషన్ కార్యదర్శి సతీష్, సభ్యులు సోమయ్య, లావణ్య, సంజయ్, విజయ్, శ్రవణ్ చంద్రశేఖర్, శివ, తదితరులు పాల్గొన్నారు