Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
కడ్తాల్ మే 6 (నిజం న్యూస్)
ఎలాంటి అనుమతులు లేకుండా లారీ B.No AP12V9001 గల లారీ లో 107 పశువులను ఆమనగల్ నుండి హైదరాబాద్ వైపు తరలిస్తుండగా లారీని కడ్తాల్ పోలీసు వారు కడ్తాల్ టోల్గేట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా లారీలో పశువులను చూసి వాహనాన్ని నిలిపివేశారు.

లారీ డ్రైవర్ అయినా సయ్యద్ హుస్సేన్  మంగల్పూర్ వాసి మరియు క్లీనర్ ఆర్.అర్జున్  రెసిడెన్షియల్ తెలకపల్లి అను వారు వారి ఓనర్ ఎండి పాషా చంద్రాయన గుట్ట అను వ్యక్తి ఆదేశాల మేరకు నోరంగపూర్ ఒడిస్సా రాష్ట్రం నుండి హైదరాబాదులోని బహదూర్ పశు మార్కెట్ కు కోయడానికి తీసుకువెళ్తున్నామని తెలిపారు.

ALSO READ: బిఆర్ఎస్ పార్టీని ఊ అంటారా? ఉహు అంటారా???

ఎలాంటి అనుమతులు లేకుండా 107 పశువులు అందులో 85 చిన్న ఆవు దూడలు. 22 చిన్నకోడదూడలు  తరలించినందుకు పిఎస్ కు తీసుకువచ్చి జియాగూడ గోశాలలో కస్టడీ నిమిత్తం అప్పగించిన రసీదు తీసుకున్నాం అని పోలీసులు తెలియజేశారు.

ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకువెళ్తున్నందుకు డ్రైవర్, ఓనర్, క్లీనర్, లపై కడ్తాల్ ఏఎస్ఐ సీతారాం రెడ్డి చట్టరీత్యా తగు చర్య తీసుకున్నారు.