Warning: preg_match_all(): Compilation failed: quantifier does not follow a repeatable item at offset 110 in /home/customer/www/nijamnews.in/public_html/wp-content/plugins/seo-by-rank-math/includes/replace-variables/class-post-variables.php on line 543
బిఆర్ఎస్ పార్టీని ఊ అంటారా? ఉహు అంటారా??? - Nijam News
Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిఆర్ఎస్ పార్టీని ఊ అంటారా? ఉహు అంటారా???

గార్ల, మే 6,(నిజం న్యూస్):-

ఇల్లెందు నియోజకవర్గంలో ఈ ఐదుగురు నాయకులు కాకలు తీరిన నాయకులు, గా చలామణి అవుతూ తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులుగా. అధికారం ఎటువైపు ఉంటే అటు వైపు ఉంటూ ఎవరి హవా నడిస్తే వాళ్ళ వెంట ఉంటూ, వాళ్ల మన్ననలు పొందుతూ, కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్, ఉన్నంతవరకు వీరి హవా కొనసాగింది. కొనసాగించుకున్నారు.

ఇక పాపం కోరం కనకయ్య ఎమ్మెల్యే ఉన్నంతవరకు వీరే మండలాలలో షాడో ఎమ్మెల్యే, లాగా వ్యవహరించారు. కోరం కనకయ్య ఉన్నంతకాలం సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఇతరత్రా ఏ పని మరియు ఈ పదవులు కావాలన్నా వీరి హవా నడిచింది.

అలా కొనసాగించుకున్నారు.
ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ ముఖ్యంగా హరి సింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఐదుగురి హవా పలుచబడిపోయినది. దాదాపు మూడు సంవత్సరాల నుండి టిఆర్ఎస్ లోనే వేరే వర్గం వారితో సంబంధాలు కలిగి రాజకీయాలు నడిపిస్తున్నారు.

Also read: గురుకుల హాల్ టికెట్లు విడుదల

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఇల్లెందు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు దాదాపు సీటు శ్రీమతి హరిప్రియ కు ఖాయమే అయినట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్యే హరిప్రియకు పోటీ గాని మరియు అనుకున్నంత ఆర్థికంగా ముందుకు వచ్చేవారు గానీ ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు ఎవరు లేరు కోరం కనకయ్య పొంగులేటి తో తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని శ్రీమతి ఎమ్మెల్యే హరిప్రియ అభ్యర్థిగా ఊ అంటారా ఉహు, ఉహు, అంటారా వేచి చూద్దాం.