రాహుల్‌కు కాలం కలసి వచ్చేనా?
బిజెపి నిరంకుశ విధానాలపై ప్రజల్లో అసహనం
న్యూఢల్లీి,మే6: విపక్షాలపై కేంద్ర ఏజెన్సీలను పురమాయిస్తూ..కంటివిూద కునుకు లేకుండా చేయడంలో మోడీ ద్వయం కొంత విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇందులో అవినీతి బిజెపినేతల చిట్టా మాత్రం లేదు. కావాలనే వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో విస్త్రృతంగా ఉంది.
ఈ చర్య వల్ల రాహుల్ గాంధీలోని నాయకత్వ లక్షణాలు బయటికొస్తున్నాయి. ప్రజలు కూడా దీనిని గుర్తిస్తున్నారు. తనపై అనర్హత వేటు వేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాహుల్ గాంధీ చక్కగా మాట్లాడారు. ఎంపీగా రాహుల్‌కు కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడం, అందుకు బదులుగా నిబంధనల ప్రకారం గడువులోపు ఖాళీ చేస్తానని ఆయన ప్రకటించడం ద్వారా రాహుల్ తన నిజాయితీ చాటుకున్నారు.
గుజరాత్ కోర్టు తీర్పు, తరవాత పైకోర్టుల్లో లభించన ఊరట తదితర అంశాలన్నీ రాహుల్‌కు కలసి వస్తున్నాయి. ఎంపిగా అనర్హుడిని చేసిన తరవాత అంతోఇంతో రాహుల్ పట్ల అభిమానం పెరిగింది. ఓ రకంగా ప్రధాని మోదీ ఇమేజ్‌కి నష్టం కలిగించాయని చెప్పవచ్చు.అయితే నెహ్రూ కుటుంబాన్ని పార్లమెంట్ గడప తొక్కకుండా చేయాలన్న పట్టుదలలో మోడీ ఉన్నారని చెప్పవచ్చు.
ALSO READ: విపక్ష పార్టీలే సీరియస్‌గా తీసుకోవడం లే
రేపటి ఎన్నికల్లో ఈ సూత్రాన్ని ఆచరించవచ్చు. తాను ఒకప్పుడు రైల్వే ప్లాట్‌ఫాంపై టీ అమ్ముకొని పొట్ట పోషించుకున్నానని చెప్పుకొంటున్న ప్రధాని మోదీకి సామాన్య ప్రజల సమస్యల కన్నా…రాజకీయం ఎక్కువయ్యింది. ఆ స్థాయి నుంచి దేశ ప్రధానిగా దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగినందుకు ప్రజలకూ ఎంతో కృతజ్ఞుడై ఉండాలి.
అయితే దురదృష్టవశాత్తు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాల్సిన నరేంద్ర మోదీలో అహం ప్రవేశించిందన్న భావన సర్వత్రా వ్యాపించింది. దీర్ఘకాలం అధికారంలో ఉన్నవారిలో సహజంగానే అవలక్షణాలు ప్రవేశిస్తాయేమో! రెండు దశాబ్దాలకు పైగా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అధికారంలోనే ఉన్నారు.
ఒకప్పుడు తాను బీజేపీ అగ్రనాయకులైన వాజపేయి, ఎల్.కె.ఆడ్వాణి వంటి వారికి అనుచరుడిగా, సహాయకుడిగా పరిచర్యలు చేసిన విషయం మోదీ మరచిపోయాడు. అధికారంలోకి రాగానే అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి ఉద్దండులను పక్కన పెట్టారు. రాహుల్ గాంధీ విషయంలో మోడీ హుందాగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు పునాదులు పడేవికావు.
నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ విజయానికి తిరుగుండదన్న అభిప్రాయం మొన్నటిదాకా ఉంది. అయితే ఇందిరాగాంధీ లాంటి వారే మట్టి కరిచారు. ప్రాంతీయ పార్టీల నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకున్నందున సంతృప్తి చెంది ఉండాల్సింది.
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ఉండకూడదు అనుకోవడం మాత్రం సరికాదు. ఒకప్పుడు బీజేపీ ఉనికిని కాంగ్రెస్ సహించేది కాదు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది చూస్తున్నాం. రేపు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం.
అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. కానీ ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయవచ్చు. అధికధరలు, జిఎస్టీ వాయింపులు, పెట్రో ధరలు ప్రజలను సూదుల్లా పొడుస్తున్నాయి. వీటిని భరించే శక్తి లేనప్పుడు తిరుగుబాటు గురించి ఆలోచిస్తారు.