Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విపక్ష పార్టీలే సీరియస్‌గా తీసుకోవడం లే

సమస్యలపై పోరాడే సంఘటిత శక్తి ఏదీ !
కర్నాటక ఎన్నికల్లో ఇప్పుడు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా సాగుతున్నారు. విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్న కెసిఆర్‌, బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ, లెఫ్ట్‌ నేతలు ఎవరు కూడా ఇక్కడ బిజెపిని ఓడిరచేందుకు కలసికట్టుగా పోరాడుదామన్న సంకల్పాన్ని ప్రకటించలేదు. అంతుకుముందు జరిగిన పలు రాష్టాల్ర ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగింది.

మోడీ కోరుకుంటున్న విధంగానే విపక్షాలు ఆచరించి చూపిస్తున్నాయి. తమలో ఐక్యత కొరవడిరదన్న విషయాన్ని ప్రజలకు గట్టిగా చెబుతున్నాయి. అంతెం దుకు ఢల్లీి కేంద్రంగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా వారికి అండగా నిలిచి పోరాడాలన్న కనీస జ్ఞానం కూడా విపక్షాల్లో లోపించింది. ఈ ఒక్క విషయం చాలు బిజెపిని నిలదీయడానికి. కానీ ఏదీ వారికి తీరికే లేదు. ఏదో వెళ్లామా అంటే వెళ్లామన్న తీరులో కొందరు వెళ్లి మద్దతు ప్రకటించారు.

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ కీర్తి పతాకాలను రెపరెపలాడిరచిన కుస్తీ వీరులపై ఢల్లీి పోలీసులు అమా నుషంగా ప్రవర్తించారు. జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై లాఠీ రaుళిపిం చారు. పోలీసులు తప్ప తాగి విర్రవీగారని రెజ్లర్లు ఆరోపిస్తుండగా..బీజేపీ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిం దంటూ విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.

ALSO READ: తెలుగు రాష్టాల్ల్రో రాజుకుంటున్న రాజకీయ సెగ 

ఢల్లీి మహిళా కమిషన్‌ కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మైనర్‌ సహా.. పలువురు మహిళా రెజ్లర్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.

తమకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్‌ 23 నుంచి వారు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి దిగ్గజ కుస్తీవీరులు, మాజీ రెజ్లర్లు మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయినా ఆ బిజెపి ఎంపిపై చర్య తీసుకోవాలని, మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఉమ్మడిగా పోరాడాలన్న చలనం విపక్షాల్లో కానరావడం లేదు. ఈ విషయాన్ని అంతా కలసి మహిళా రాష్ట్రపతి ముందుకు తీసుకుని వెళ్లవచ్చు.

నిజానిజాలను విచారించాలని కోరవచ్చు. బిజెపి ఎంపిపై చర్యలకు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నా.. విపక్ష పార్టీలే పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. మహిళా రెజ్లర్లకు అండగా పోరాడాలన్న కనీస నైతికతను కూడా మహిళా ఎంపిలు కనబర్చడం లేదు. ఎందుకంటే వారికి రాజకీయాలను మించిన సమస్య మరోటి లేదు కనుక.

అంతెందుకు..కర్నాటకలో బిజెపి గడ్డుకాలం ఎదుర్కొంటోందంటున్న నేతలే కలసి పని చేయడానికి ముందుకు రాలేదు. కర్నాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బిజెపికి కలసివచ్చేదిగా ఉంది.అక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తున్నా…నేతలు అవినీతి లో కూరుకుపోయారు. బిజెపి అవినీతిని ఎలుగెత్తాల్సిన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేయడం లేదు. ఎందుకంటే అవినీతిలో అన్ని పార్టీల నేతలదీ ఒకటే దారి.

మరోవైపు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడాన్ని పలు ప్రాంతీయ పార్టీలు అంగీకరించే పరిస్థితిలో లేవు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించడానికి సిద్ధంగానే ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం అంటూ కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజీవ్రాల్‌ వంటివారు ప్రకటిస్తూనే ఉన్నారు.

అయితే రాహుల్‌ గాంధీకి సంఫీుభావం తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ మూడు పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలంటే జయప్రకాశ్‌ లాంటి అనుసంధానకర్త కావాలి. అంత నిజాయితీగా ఉండి విపక్షాలను నడిపించే సత్తా ఉన్న లేదా..గట్టిగా అదిలించే వ్యక్తి ఎవరూ లేరు.

ఎందుకంటే ఐక్యత కోరుకుంటున్న వారంతా ప్రధాని పదవిని కోరుకుంటున్న వారే. కర్నాకటలో కూడా కుమారస్వామి, సిద్దరామయ్య, డికె శివకుమార్‌ తదితరులంతా సిఎం పదవిపై కన్నేసిన వారే. అందుకే విపక్షాల ఐక్యత అన్నది ఎండమావిగా మారుతోంది. నిజానికి కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ఆ విషయం అన్ని పార్టీలకు తెలుసు.

ALSO READ: ఈ యువకుడు భారతదేశం కోసం చాలా సంవత్సరాలు..

అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌ మద్దతుతో ప్రధాని గద్దెపై ఒక్కసారయినా ఎక్కాలని చూస్తున్నవే. ఇలా చేసే చరణ్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, విపిసింగ్‌ లాంటి వారు ప్రధాని పదవిని అధిష్టించినా..దేశాన్ని పాలించే సత్తా లేదని నిరూపిం చుకున్నారు. ఒకవేళ కలిసినట్టు కనిపించినా ప్రస్తుతం మోడీ నాయక్తంలో ఉన్న బీజేపీని ధీటుగా ఎదుర్కో లేరు.

కాంగ్రెస్‌ పార్టీ కూడా నిస్వార్థంగా పోరాడాలన్న సంకల్పాన్ని కూడా ప్రకటించడం లేదు. మొత్తంగా చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడున్న పార్టీలకు లేఆ నేతలకు దేశాన్ని పాలించే సత్తా లేదు. అలావుంటే ఆయా రాష్టాల్ల్రో అధికారం లో ఉన్న నేతలు విప్లవాల సాధించేవారే. రాష్టాల్ర రూపురేఖలు మారేవు.

ఈ విషయంలో ఎంతో కొంత తెలంగాణ ముందున్నా..అనేక అవినీతి మరకలు కెసిఆర్‌ కుటుంబాన్ని వెన్నాడు తున్నాయి. అందుకే విపక్షాల ఐక్యతను సాధించే విషయమై కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజీవ్రాల్‌,నితీశ్‌ కుమార్‌ లాంటి వారికి నచ్చజెప్పగల నాయకుడు కానారావడం లేదు. అయితే విభేదాలను పక్కన పెట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌తో కలవాల్సిన పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు కల్పిస్తున్నా..దాన్ని అందిపుచ్చుకోవడం లేదు.

కేంద్ర ఏజెన్సీలకు భయపడి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతు న్నట్లు కనిపించినా.. ఎవరికి వారు పదవీకాంక్షతో అడుగు ముందుకు వేయడం లేదు. ఎందుకంటే తమ అవినీతి కేసుల భయం నేతలందరినీ వెన్నాడుతోంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ సైతం కేంద్ర ఏజెన్సీల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారే.

షాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీ పేరు చెప్పాలని సీబీఐ అధికారులు అప్పట్లో తనపై ఒత్తిడి తెచ్చారని ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొద్దిరోజుల క్రితం వెల్లడిర చారు. నాటి అనుభవాల నుంచి ఉత్పన్నమైన పగ, ప్రతీకారాలు ప్రధాని మోదీని కుదురుగా ఉండనివ్వడం లేదు.

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి శిక్ష పడటానికి, ఆ వెంటనే ఆయనను అనర్హుడిగా ప్రకటించ డానికి మోదీ కక్షపూరిత రాజకీయాలే కారణమని చెప్పక తప్పదు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇలాగే భావించింది. 2014లో ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంత దుర్భలంగా తయారైందో చూస్తున్నాం.

నరేంద్ర మోదీ ఇంత బలమైన నాయకుడిగా ఆవిర్భవిస్తారని విపక్షాలు ఊహించి ఉండవు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు, విచారణ బెడదను స్వయంగా అనుభవించిన మోదీ, ఇప్పుడు ప్రధానిగా ప్రత్యర్థులను తొక్కివేయడానికి అదే సూత్రం ఎంచుకున్నారని అనుకోవాల్సిందే.

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తనను వేధించి నందువల్లే ప్రధానమంత్రి స్థాయికి చేరుకోవాలన్న పట్టుదల మోదీకి ఏర్పడి ఉండవచ్చు. ఇప్పుడు మోదీ నుంచి వేధింపులకు గురవుతున్న నేతలంతా కూడా ఎవరికి వారు ప్రధాని కావాలని యోచిస్తున్నారు. అందుకు ఉమ్మడిగా పోరాడేందుకు కలసి రావడం లేదు.

కాలం కలసి వస్తే తామే ప్రధాని అవుతామన్న భ్రమల్లో అందరూ ఉన్నారు. అందుకే విపక్షాల ఐక్యత అన్నది సాధ్యం కాదని తేల్చేస్తున్నారు.