తెలుగు రాష్టాల్ల్రో రాజుకుంటున్న రాజకీయ సెగ
ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇప్పుడు రాజకీయవేడి అందుకుంది. రాజకీయ పార్టీల నేతలు సమస్యలను ఎత్తిచూపుతూ పరస్పర విమర్శలు చేసుకోవడంతో వేడి రాజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఆంధ్రాలో మరో ఏడాది ఉంది. అయినా రాజకీయంగా అప్పుడే సెగలు పుట్టిస్తున్నారు.
మొత్తంగా తెలుగు రాష్టాల్ల్రో రాజకీయ హడావిడి మొదలయ్యింది. తెలంగాణలో ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తోడు వైఎస్ షర్మిల రాజకీయంగా పట్టుకోసం పరుగుతీస్తున్నారు. బిఎస్పిలో చేరిన మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రంగంలో ఉన్నారు.
ఇంకోవైపు తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ కూడా ఉన్నారు. కర్నాటక ఎన్నికల తరవాత ఈ జోరు మరింత పెరగవచ్చు. మే పదిన అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీతె దేశ రాజకీయాల్లో పోటీ పడతామన్న కెసిఆర్ కర్నాటక ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
ALSO READ: దక్షిణ మధ్య రైల్వే (SCR) రికార్డు స్థాయి విద్యుదీకరణ
ఢల్లీిలో పార్టీ కార్యాలయం అట్టహాసంగానే ప్రారంభించి..దేశంలో ఉనికిని చాటే యత్నాల్లో ఉన్నారు. ఎపిలో జగన్ ప్రారంభోత్సవాలు, బటన్ నొక్కుళ్లతో రాజకీయంగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు ఒకవైపు నారా లోకేశ్ మరోవైపు దూకుడు పెంచారు. ఇలా తెలంగాణనే కాదు..ఎపిలో మరో ఏడాదికిముందే ఎన్నికల హడావిడి సాగుతోంది. ఎ
పిలో ఏడాదికి ముందే అక్కడ కూడా రాజకీయ సెగలు పుట్టిస్తు న్నారు. త్వరలోనే తెలంగాణకు ప్రియాంక గాందీ రాబోతున్నారు. సభలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తించాలని చూస్తోంది. మరోవైపు భట్టి విక్రమార్క పాదయాత్రతో ప్రజల దగ్గరకు వెళుతున్నారు.
అలాగే నేతలు కూడా అంతా విభేదాలు మరచి ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌లో ఐక్యత ఎంతవరకు అన్నది మున్ముందు తేలనుంది. ఎందుకంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఏదో రకంగా పొగబెడుతూనే ఉన్నారు. అయన కాళ్లకు ఎక్కడిక్కడ బంధాలు వేస్తున్నారు. బిజెపి చేరికలపైనే ఆధారపడి పనిచేస్తోంది.
నేతలంతా ఎక్కడిక్కడ రాజకీయ యాత్రలతో బిజీగా గడపుతున్నారు. ఆంధ్రాలో అధికార, విపక్షాలు ఎన్నికల హడావుడి చేసేస్తున్నాయి, విపక్షాలను చిత్తు చేయాలని అధికార పక్షాలు, అధికార పక్షంలోకి రావాలని విపక్షాలు తొందర పడుతున్నాయి.
తెలంగాణలో ప్రతిపక్షాలు కోలుకోకముందే ప్రజల్లో పట్టును మరింత పెంచుకుని వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారాన్ని సొంతం చేసుకుని బిఆర్‌ఎస్‌ను అజేయ శక్తిగా తీర్చిదిద్దాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాలు పన్నుతున్నారు.
మరోవైపు 2023లో జరిగే ఎన్నికలలో అధికారాన్ని మళ్లీ హస్తగతం చేసుకుని తన వారసుడిగా కుమారుడైన కెటిఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్నదే కెసిఆర్ లక్ష్యంగా ఉందని లక్ష్యమని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఎపిలో వైకాపా ఎత్తుగడల రాజకీయాలతో టిడిపిని ఆత్మరక్షణలో పడేసింది.
ALSO READ: ఈ యువకుడు భారతదేశం కోసం చాలా సంవత్సరాలు..
వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, దుకాణం మూసుకోవాల్సి వస్తుందన్న భయంతో ఏపీలో ప్రతిపక్ష టిడిపి ఉంది. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు అధినేత చంద్రాబాబు ముందే ఎన్నికల వార్ ప్రకటించారు. చంద్రబాబు వైకాపాకు దీటుగా నాయకులను సమాయత్తం చేస్తున్నారు.
మంత్రులు మొదలు సిఎం జగన్ వరకు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని కూడా వైకాపా నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. రాజకీయాలు మొత్తంగా ఇప్పుడు వైకాపా చుట్టు తిరుగుతున్నాయి. రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్టాల్ల్రో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ కథ కంచికే అన్నట్లుగా ఇప్పుడు ఉన్న నేతలు కూడా పెద్దగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యనేతలు కూడా అంతర్థానం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ నేతలు మళ్లీ పంచె భుజాన వేసుకుని వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతున్నా విభజన పాపం ఎపిలో వారిని ముందుకు సాగనీయడం లేదు. ఇప్పటి నుంచే పోరాటాలు చేద్దామన్నా కాలం కలసి రావడం లేదు. అయితే టిడిప లేదంటే వైకాపా అన్న రీతిలో ఎపిలో రాజకీయాలు సాగుతున్నాయి.
దీంతో కాంగ్రెస్‌కు స్థానం దాదాపు లేనట్లుగానే గుర్తించాల్సి ఉంది. ఇంచుమించుగా ఉభయ తెలుగురాష్టాల్ల్రో ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎపిలో ప్రత్యేకహోదా, తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా వీరి పోరు సాగుతున్నా తెలంగాణలో ఉన్న పరిస్తితి కూడా ఎపిలో కాంగ్రెస్‌కు లేకుండా పోయింది.
ALSO READ: కేఎల్ రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్
విభజనతో ఎపిలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ మెల్లగా పుంజుకోవాలనుకుంటున్నా నాయకత్వ సమస్యతో పాటు పరిస్థితు లు కూడా కలసి రావడం లేదు. గతంలో ప్రత్యేకహోదా కోసం కోటి సంతకాల సేకరణ, ధర్నాలు చేపట్టగా ఇప్పుడు మెల్లగా ప్రత్యేకహోదా రాదని తేలిపోవడం, ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడంతో దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. దీనిపై పోరాటం ఇక విఫల ప్రయత్నంగా మారింది.
ప్రజలు కూడా దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీ ప్రజలకు చెప్పుకొనేందుకు ఓ బలమైన అస్త్రం లేకుండా పోయింది. ప్రత్యేకహోదా అంశం కాంగ్రెస్‌కు ఆక్సిజన్ నింపుతుందని ఆశించినా లాభం లేకుండా పోయింది. విభజన అపవాదు నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ బయటపడే పరిస్థితులు కానరావడం లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన ఏపి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు అనేకులు ఇప్పటికే పార్టీని వీడారు. ధర్మాన, బొత్స తదితరులు పార్టీని వీడి వైకాపాలో కొనసాగుతున్నారు. కొందరు బిజెపిలో చేరారు. మరికొందరు టిడిపిలో దూకారు. కొందరు తెరచాటుకు వెళ్లారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలను ఎక్కుపెడుతున్నా ప్రజల్లో కదలిక తేలకపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పార్టీని జనంలోకి తీసుకెళ్లేం దుకు ఏపి కాంగ్రెస్ పోరాటం చేసింది. సీనియర్ నేతలు ఎవరూ ఏపి కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించ డంలేదు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఇంకా చురుకుగా ఉన్నారు. ఇక్కడ నేతలంతా ఉద్యమంలో ఉన్నారు.
ALSO READ: మామిడి రైతులను ముంచుతున్న ఓ దళారి ..?
వారు గత కొంత కాలంగా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే దూకుడుతో ముందుకు సాగినా ఏ మేరకు ఫలితం సాధిస్తారని ఇప్పుడే చెప్పలేక పోయినా కాంగ్రెస్ చురుకుగా పోరాడుతోందని చెప్పగలం. టిఆర్‌ఎస్‌కు దీటుగా ఇప్పుడు కాంగ్రెస్, బిజెపిలు ఉద్యమిస్తు న్నాయి.
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా టిఆర్‌ఎస్‌ను ఢీకొంటున్నారు. కెసిఆర్ వ్యూహాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. విపక్షాలకు దీటుగా ఆయన ఎత్తుగడలు వేస్తున్నారు. కొత్త పథకాలతో ముందుకు వస్తున్నారు. దళితబంధు ప్రకటించిన తరవాత పెద్దగా స్పందన రాకున్నా ఇప్పుడిప్పుడే మెల్లగా ప్రజల్లోకి వెళుతోంది. ఇది పెద్ద అసెట్ కానుంది.
పెట్రో,గ్యాస్ ధరలు, వంటనూనెల ధరలు, జిఎస్టీ వంటివి బిజెపికి మైనస్ కానున్నాయి. మొత్తంగా రాజకీయంగా ఇప్పుడు వేడి పుట్టిస్తున్నారు. తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపిలు, ఆంధ్రా లక్ష్యంగా టిడిపి,జనసేన,బిజెపిలు మైదానంలోకి దిగాయి.