Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మామిడి రైతులను ముంచుతున్న ఓ దళారి ..?

ఇదేమని ప్రశ్నిస్తే.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపు.

దళారులు అమ్మటానికి పర్మిషన్ ఉన్నట్లా…. లేనట్లా….

గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల వేడుకోలు.

సూర్యాపేట ప్రతినిధి మే 6 నిజం న్యూస్

ఇటీవల అకాల వర్షాలకు వేచిన వడగండ్లకు మామిడి తోటలు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో మామిడి రైతుల ని సహాయతను ఆసరా చేసుకున్న ఓదలారి ఏకంగాఎలాంటి పర్మిషన్ లేకుండా మామిడికాయల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మామిడి కాయల రైతులను దోచుకున్న తీరు పలు మామిడి రైతులను కంటనీరు పెట్టిస్తుంది.

వివరాల్లోకెళ్తే వద్దిరాల మండల కేంద్రంలో తుంగతుర్తి మండలం పరిధిలోని కరివిరాల గ్రామానికి చెందిన ఓ దళారి మామిడికాయల కొనుగోలు వ్యాపారం చేస్తూ మామిడి రైతులను దోపిడీ చేస్తున్నాడు. తుంగతుర్తి నియోజకవర్గం లోని మద్దిరాల నూతనకల్లు తుంగతుర్తి మండలాల్లో మామిడి తోటలు విరివిగా ఉన్నాయి.

జిల్లాలో ఎక్కడా కూడా మామిడికాయల విక్రయ కేంద్రాలు లేకపోవడంతో కొందరు దళారులు పుట్టుకొచ్చి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి మామిడి రైతులను నిండా ముంచుతున్నారు . మీరు మార్కెటింగ్ శాఖ నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మామిడికాయలు తీసుకొచ్చిన రైతుల నుండి తమకి ఇష్టం ఉన్న ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇట్టి దందాను అరికట్టవలసిన మార్కెటింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరి ఆగడాలు మితిమీరి పోయాయని పలువురు మామిడి రైతులు ఆందోళన చేస్తున్నారు.

ALSO READ: చెట్టు నుండి తీసే మకరందమే నీరా

మామిడికాయల కొనుగోలు కేంద్రాల్లో దళారులు చెప్పిన ధరకే మామిడి కాయలు ఇవ్వాల్సింది మీకు తెచ్చిన మామిడికాయ లు బాగా లేవని కిలో ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తామని ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా మామిడికాయల విక్రయ కేంద్రాలు ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

ఇటీవల వాతావరణంలో మార్పులు సంభవించడంతో వడగళ్ల వా నాతో రైతులు తీవ్రంగా నష్టపోయారు . గత రెండు మూడు సంవత్సరాల నుంచి మామిడికాయ కొనుగోలు నిర్వాహకులు మామిడి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. వాతావరణం అనుకూలించక తరచూ ఈదురు గాలులు రాళ్లవానకు మామిడి రైతులు అతలాకుతలం అవుతా ఉంటే ఇదే అదునుగా చేసుకొని రాత్రిపూట మామిడికాయల పాట పాడుతూ తమ ఇస్తాను సారంగా తామే ధర నిర్ణయించి మామిడి రైతులను కొల్లగొడుతున్నారు.

ALSO READ: దానికి వయసు అడ్డమా..?

వరంగల్ ,హైదరాబాద్ పట్టణాలలో 30 రూపాయలకు కిలో పలికే మామిడి కాయను మంగు ఉందని కాయ సైజు లేదని కిలో ఐదు రూపాయలకు తీసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే మీ కాయలు మీరే తీసుకెళ్లండి మేము నిర్వహించిన ధరకే మీరు అమ్మాలి లేకుంటే మీ కాయలు మీరే తీసుకెళ్లండి అని తెలపడంలో రైతులు ఆ రాత్రి ఎటు వెళ్లలేక నిర్వాహకులు పాడిన. పాటకే రైతులు మామిడికాయలను ఇచ్చివేస్తున్నారు

ప్రతి 100 కిలోలకు 10 కిలోల మామిడికాయలను అదనంగా చూట్ రూపంలో తీసుకోవడమే కాక. బిల్ చేసిన పైసల్లో నూటికి రెండు రూపాయలు కమిషన్ చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాక తూకం వేసి కాంటాలో కూడా తేడాలు ఉన్నాయని మామిడి రైతులు ఆరోపిస్తున్నారు.. ఇదేమని ప్రశ్నిస్తే నేను అధికార పార్టీకి చెందిన నాయకుడిని అని నాకు పర్మిషన్ అవసరం లేదని నన్ను ప్రశ్నిస్తే బాగుండదని మీ అంతు చూస్తా నంటూ బెదిరిస్తున్నాడని మామిడికాయ రైతులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మామిడికాయల కొనుగోలు కేంద్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది, పర్మిషన్ లేకుండా నడుస్తున్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

దళారీలపై చర్యలు తీసుకుంటాం!

మార్కెట్ అధికారి సురేష్.
నియోజకవర్గంలో ఎక్కడ మామిడికాయల కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అనుమతి కోసం పూర్తి పత్రాలను మద్దిరాల క్రాస్ రోడ్ వారు అందజేయలేదు. ఇటీవల వారికి పర్మిషన్ తీసుకోవాలని తెలియజేశాం. కానీ వారు స్పందించలేదు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు..