Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందుబాటులో…

భద్రాద్రి కొత్తగూడెం మే5 (నిజం న్యూస్): జూలూరుపాడు
దొండపాటి శ్రీనివాస్ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని సమస్యని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములు నాయక్ కు విన్నవించగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావుకు సిఫార్స్ లెటర్ ఇవ్వటం జరిగింది

ALSO READ: దానికి వయసు అడ్డమా..?

ఎమ్మెల్యే ఆదేశానుసారం ఈరోజు హైదరాబాద్ లో ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి సమస్య ని ఎమ్మెల్యే గారి సిఫార్స్ లెటర్ ని అందించగానే వెంటనే మంత్రి స్పందించి పక్కన ఉన్న అధికారులకు గ్రామస్తులకు ఇంకా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రాధమిక అరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించటం జరిగింది.
గ్రామస్తుల సమస్య ఇది అని చెప్పగానే సమస్యని విన్న తక్షణం స్పందించి వెంటనే మంత్రి శ్రీ హరీష్ రావుకు సిఫార్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములునాయక్ మరియు వెంటేనే స్పందంచి అధికారులని ఆదేశించిన మంత్రి వర్యులు  తన్నీరు హరీష్ రావుకు హృదయ పూర్వకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన నాయకులు దొండపాటి శ్రీనివాస్, గ్రామ ప్రజలు తరఫున వారికి కృతఙ్ఞతలు తెలియజేశారు.