నేడే జాబ్ మేళా
నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి!!
మాడ్గుల మే 05( నిజం న్యూస్):
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం, రాఘవేంద్ర హిల్స్ లో శనివారం నాడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.
ALSO READ: అమ్మవారి దివ్య దర్శనం కోసం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 50 కంపెనీలలొ 5000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ ఉద్యోగ మేళాకు మాడ్గుల,అమన్ గల్, కడ్తాల్, వెల్దండ, తలకొండపల్లి,కల్వకుర్తి మండలాల నిరుద్యోగ యువతి,యువకులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు