Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమ్మవారి దివ్య దర్శనం కోసం

అమ్మవారి చతుర్వేద సరస్వతీ మంత్ర సహిత చండి హోమము

ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 5 నిజం న్యూస్)

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానంలో ప్రతీ మాసము పౌర్ణమి రోజున జరిగే మాసపూజ చతుర్వేద సరస్వతీ మంత్ర సహిత చండి హోమము

శుక్రవారం ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, రక్షా బంధనము,మండపరాధన, పుణ్యా:హవచనం, దీక్ష సంకల్పంతో ఆలయ స్థానాచార్యులు ప్రధానార్చకుల ఆధ్వర్యం లో ,వేదపండితులు, పూజరులచే చండి హోమము నిర్వహించారు.

ALSO READ : బైక్ లో తెలంగాణ..

ఆలయంలో భక్తుల తాకిడి

ఆలయంలో వైశాఖ శుద్ద పౌర్ణమి, వేసవి సెలవులు కావడంతో భక్తులు ఉదయం నుండీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవస్థానంలో అమ్మవారి దివ్య దర్శనం కోసం బారులుదీరారు.

భక్తులు అమ్మవారి సన్నిధిలో అధిక సంఖ్యలో అక్షరాభ్యాస పూజలు, దర్శనాలు,ప్రత్యేక పూజలు చేసారు. అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులకు అసౌకర్యం కాకుండా ఆలయ సిబ్బంది అన్నివిధాల ఏర్పాట్లు చేసారు