Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒక్క ఫేక్ కాల్ తో ఎన్నెన్నో…

రైల్వే శాఖకు ఫేక్ కాల్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి..

రైల్వే జిఆర్పి. సీఐ.. నాగరాజు, రైల్వే ఆర్పిఎఫ్. సిఐ. బోయ కుమార్

ధర్మవరం మే 05 (నిజం న్యూస్): దేశ ప్రజలందరికీ ప్రయాణ విషయంలో అన్ని సౌకర్యాలతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని ఇస్తున్న రైల్వే శాఖ పై ఫేక్ కాల్స్ చేస్తే కఠిన తరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని రైల్వే జిఆర్ పి. సి ఐ. నాగరాజు, రైల్వే ఆర్పిఎఫ్సిఐ బోయ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే విభాగంలో గల జిఆర్పి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ ఈనెల మూడవ తేదీన రైలు నెంబర్ 17248 కదిరి రైల్వే స్టేషన్ కు చేరుకున్నప్పుడు కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలం గొల్లపల్లి తండాకు చెందిన తేజేశ్వర్ నాయక్ ఫేక్ కాల్ చేయడంతో దాదాపు రైలు కొన్ని గంటల వరకు ఆపవలస వచ్చిందని తెలిపారు.

తదుపరి రైల్వే శాఖలోని వివిధ విభాగపు అధికారులతో పాటు జి ఆర్ పి సి ఐ గా నాగరాజు, ఆర్పీఎఫ్సీఐ బోయ కుమార్, ధర్మవరం జిఆర్పి రైల్వే ఎస్సై గోపి కుమార్, కదిరి రైల్వే ఎస్సై రహీం, కదిరి ఆర్పిఎఫ్ ఏఎస్ఐ శివారెడ్డి, కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్బాషా తో పాటు ఆర్పీఎఫ్, జి ఆర్ పి సిబ్బంది ఎంతగానో కృషిచేసి, ఎట్టకేలకు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని వారు తెలిపారు.

ALSO READ: ప్లీజ్ తాత మా అమ్మ, నాన్నలను…

ఒక్క ఫేక్ కాల్ వలన రైల్వేలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసిన పరిస్థితి రావడం జరిగిందన్నారు. గుంతకల్ రైల్వే ఎస్ఆర్పి చాముండేశ్వరి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, వెంటనే చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల మేరకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి, శుక్రవారం రోజున కేసును నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు.

రైల్వే శాఖకు ఆస్తులు నష్టపరిచిన, రైల్వే ప్రయాణానికి ఇబ్బందులు కలగజేసిన, ఫేక్ కాల్స్ చేసిన రైల్వే సెక్షన్ ప్రకారం తీవ్రమైన చర్యలతో పాటు పట్టుదిట్టమైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా రైళ్లల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు అప్రమత్తంగా, జాగ్రత్తతో వ్యవహరించాలని, కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకుంటే ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని తెలియజేశారు.

విలువైన వస్తువులను రైళ్లల్లో తీసుకొని రాకూడదని, ఒకవేళ అత్యవసరంగా తీసుకొని రైళ్లల్లో ప్రయాణిస్తే దానికి భద్రత ఆ కుటుంబం వారే వ్యవహరిస్తే,దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని వారు తెలిపారు. రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు తమకు కేటాయించిన షీట్లలోనే కూర్చోవాలని, రైలు తలుపుల వద్ద కూర్చుంటే అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు.

రైలు ప్రయాణికుల భద్రత కొరకు నేడు జి ఆర్ పి తోపాటు ఆర్పీఎఫ్ పోలీసులు కూడా నిరంతరంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారని, ప్రయాణికులు కూడా మాతో సహకరించినప్పుడే సుఖవంతమైన ప్రయాణం రైళ్లల్లో కొనసాగుతుందని వారు తెలిపారు.

అదేవిధంగా రైళ్లల్లో మీకు ప్రమాదాలు, ఆపదలు జరిగిన, ఎటువంటి అసౌకర్యం జరిగిన టోల్ ఫ్రీ నెంబర్ 139 కు కాల్ చేసి సరైన న్యాయమని కూడా పొందే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఆర్ పి, ఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.