Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్లీజ్ తాత మా అమ్మ, నాన్నలను…

పసి పిల్లలతో పంచాయతి సెక్రటరీల నిరసన

వలిగొండ మే 5 (నిజం న్యూస్)
మండలంలో జూనియర్ మరియు ఔట్సోర్సింగ్ పంచాయతి కార్యదర్శుల నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ పల్లెల రూపురేఖలు మార్చిన ఘనతలో మా సహకారం ఉందని, అలాగే దేశవ్యాప్తంగా జాతీయ గ్రామ పంచాయతి అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 13 గ్రామాలకు అవార్డులను తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించామని పేర్కొన్నారు.

ALSO READ: అభివృద్ది లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి

అదేవిధంగా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నజీర్ మాట్లాడుతూ ఈరోజు జూనియర్ పంచాయతి కార్యదర్శుల యొక్క కృషి వల్లనే హరితహారంలో మొక్కలు పెంపకం, అటవీ శాతం పెంపు, పల్లె ప్రగతి అభివృద్ధి పనులను దిగ్విజయంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.

ఈరోజు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శుల పిల్లలు వారి కుటుంబ సభ్యులతో పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్, శివ, రమేష్, హుస్సేన్, నవనీత, కవిత, అశ్విని, లక్ష్మి, రేణుక, స్వప్న, జలంధర్, లింగస్వామి, సాయి తదితరులు పాల్గొన్నారు.