Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అభివృద్ది లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి

మోడల్ పట్టణంగా కోదాడ ను తీర్చిదిద్దుతా

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

కోదాడ పట్టణాన్ని అన్ని అంగులతో సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ అర్బన్ మెగా పార్క్

ముమ్మరంగా కోదాడ పట్టణ అభివృద్ధి పనులు

*10 వ వార్డ్, 11 వ వార్డ్ లలో 20లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కల్వర్ట్ బ్రిడ్జిని, 15లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బాస్తీ దావఖానాను మరియు 8వ వార్డులో 1 కోటి 50 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మించిన మోడల్ మెగా పార్కును ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ **

కోదాడ మే 5 నిజం న్యూస్

కోదాడ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోదాడ ,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ** అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని 10వ వార్డ్,11వవార్డ్ లలో ప్రజల రాకపోకల సౌకర్యార్థం కాలువల పై 20లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కల్వర్ట్ బ్రిడ్జిని, 13 లక్షల వ్యయంతో బస్తీ దావఖానను ప్రారంభోత్సవం *ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ** చేశారు.

అనంతరం ఎనిమిదో వార్డ్ లో 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కోదాడ అర్బన్ మెగా పార్కును *ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ** ప్రారంభించారు.ఆయ వార్డ్ లకు వెళ్ళిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కి గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ALSO READ: రైతుల కండ్లల్లో నీళ్లు తెప్పించిన కెసిఆర్ ప్రభుత్వం

అనంతరం *ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…… పార్టీలకు అతీతమైన అభివృద్ది నే ఎజెండా గా బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో కోదాడ పట్టణం లో సాగుతున్న అభివృద్ధి పనులలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.2018 కు ముందు ప్రస్తుతం కోదాడ లో ఉన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని కోరారు..

కోదాడ ను నందనవనంగా మార్చడమే తన లక్ష్యం అన్న *ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ** అన్నారు. ప్రజలందరికి ఉపయోగపడే విధంగా అర్బన్ మోడల్ పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు.
పట్టణాలకు నూతన హంగులు వ‌స్తున్నాయ‌న్నారు.

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి- సంక్షేమ పథకాలను రెండు కళ్ళలాగా చూస్తూ ముందుకు వెళ్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులతో కోదాడ పట్టణాని అభివృద్ధి చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోదాడ పట్టణాన్ని కోట్లాది రూపాయలతో మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు.

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవఖానలు బస్తీ దవఖానలు నిర్మిస్తుందని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి కార్య్రమాలకు ప్రారంభోత్సవానికి చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే తో సెల్ఫీ దిగడానికి స్థానిక ప్రజలు పొటీ పడ్డారు.

అనంతరం ఆయా వార్డులలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు శాలువాతో సత్కరించి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్, ఆర్డీఓ కిషోర్ కుమార్, ఎమ్మార్వో శ్రీనివాస్ శర్మ, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యబాబు, ఆల్ఫాఫ్ హుస్సేన్, అనంత సైదయ్య, పట్టణ కౌన్సిలర్లు మామిడి పద్మావతి, రమణ నాయక్, కందుల చంద్రశేఖర్, కోట మధు, షేక్ మదర్, సాదిక్, ఖజా, స్వామి నాయక్, డాక్టర్ బ్రహ్మం, మామిడి రామారావు, బెజవాడ శ్రవణ్, కట్టెపోయిన శ్రీనివాస్ యాదవ్, గుండెల సూర్యనారాయణ, బిఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్,తుమ్మలపల్లి భాస్కర్, పసుపులేటి రామారావు, గంధం పాండు, నెమ్మది దేవమణి, తాజ్, రహీం, బత్తుల ఉపేందర్, వంశీ, లక్ష్మీనారాయణ, అఖిల్, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు నిరంజన్, కళ్యాణ్ చక్రవర్తి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.