Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతుల కండ్లల్లో నీళ్లు తెప్పించిన కెసిఆర్ ప్రభుత్వం

ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపే.. ..
– మైనారిటీలకు 12% రిజర్వేషన్ హామీ ఏమైంది..

– వక్ఫ్ బోర్డుకు జ్యూడిషియల్ పవర్ కల్పిస్తాము హామీ ఏమైంది..

– ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం..

– రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారం కాంగ్రెస్ పార్టీ దే..

సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క..

భువనగిరి ఇంఛార్జి మే 05(నిజం న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని చేరుకున్న సీ.ఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది ప్రజలు వచ్చి భట్టి విక్రమార్కకు బ్రహ్మ రధం పట్టారు.

అలాగే డీసీసీ అధ్యక్షులు కుంభం నేత్రుత్వంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్
పి.ఆర్.ఓ ఇశ్రత్ జహాన్ మైనారిటీ మహిళతో కలిసి* ముస్లిం మైనారిటీ ల సమస్యలపై అసెంబ్లీ లో *మాట్లాడాలని భట్టి విక్రమార్క ను కోరడం జరిగింది. అలాగే రాబోయే ఎన్నికల్లో అనిల్ రెడ్డిని భువనగిరి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని భట్టికి హామీ ఇచ్చారు.
అనంతరం డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ మజహర్ ఆధ్వర్యంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం భట్టి విక్రమార్క ను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్బంగా సీ ఎల్పి నేత విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. మైనారిటీ లకు కెసిఆర్ తమిళనాడు తరహాలో 12%రిజర్వేషన్ కల్పిస్తానని మరియు వక్ఫ్ బోర్డు కు జ్యూడిషియల్ పవర్ ఇస్తానని మోసం చేసాడని గుర్తు చేసారు.

ALSO READ: మహిళపై దాడి… బంగారం అపహరణ

అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ లకు కేవలం 50కోట్లు మాత్రమే మంజూరు చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.మరియు మైనారిటీ లకు డబల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయడం లో మోసం చేసారని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మైనారిటీలు అన్ని రకాలుగా అభివృద్ధి 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ కె దక్కుతుందని అన్నారు.

అలాగే నల్లగొండ ఎంపీ.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ హోం మంత్రి అమిత్ షా ముస్లిం మైనారిటీ లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4%రిజర్వేషన్ తొలగిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారిపై మండి పడ్డారు.మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్ తొలగించే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదని రేపు అధికారం లోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయె నని ముస్లిం మైనారిటీ లకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు.

అలాగే సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కలిసి ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్ పై చర్చిస్తానని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 9ఏండ్ల కాలంలో నియోజకవర్గం లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేల అండర్ గ్రౌండ్ డ్రైనేజి ల పేరిట రోడ్డు విస్తరణ అని అనాలోచితంగా అభివృద్ధి పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని అయనపై మండి పడ్డారు.

ఎండ కాలంలో పడ్డ వర్షానికి కొన్ని వార్డులు ముంపునకు గురయ్యాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే అవసరం లేని చోట త్రిబుల్ ఆర్ వేస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాగిర్ లో చేస్తున్న అతి పెద్ద వెంచర్ నుండి త్రిబుల్ ఆర్ పోకుండా పేద రైతుల పొలాలనుండి త్రిబుల్ వెళ్లడమేంటని ప్రశ్నించారు.

తన భూములను కాపాడుకోవటానికే త్రిబుల్ ఆర్ ప్రణాళిక తెచ్చి కోట్ల రూపాయలు గడిస్తున్నాడని ఆరోపించారు. త్రిబుల్ ఆర్ బాధితులకు పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ మజహర్, అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ.అవేస్ చిస్తీ, మైనారిటీ నాయకులు ఎండీ.ఇస్తి యాక్, ఎండీ.తాహేర్, ఎండీ.నజీర్, ఎండీ.ఫయాజ్, ఎండీ.సమీర్, ఎండీ.బురాన్, ఎండీ.ఇంతియాజ్, ఎండీ.అజహర్ తదితరులు పాల్గొన్నారు.