Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహిళపై దాడి… బంగారం అపహరణ

చింతకాని మే 04(నిజం న్యూస్):చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన అలవాల రాంబాయి చింతపల్లి గ్రామానికి చెందిన తన బంధువుల యొక్క వివాహ వేడుకకు హాజరైనందుకు వెళుతూ ఖమ్మం బస్టాండ్ నుండి బైపాస్ రోడ్ లో గల ఓ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంలో ఆటోలో ఎక్కారు.

ALSO READ: మానవత్వాన్ని చాటుకున్న గోకినేపల్లి ఆటో డ్రైవర్స్

ఆటో డ్రైవర్ ఆమెను ఆటో ఎక్కించుకొని బైపాస్ రోడ్ లో గల ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకెళ్లకుండా మారెమ్మ గుడి రోడ్డు వైపుకు మళ్ళించడంతో ఆటో డ్రైవర్ను రాంబాయి ఫంక్షన్ హాల్ దాటి వెళుతున్నావు ఏమిటి అని ప్రశ్నిస్తున్నా…

వినిపించుకోకుండా ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామ శివారు వద్దకు ఆటోను తీసుకెళ్లి బండరాయితో ఆమెపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న బంగారు తాడు ,పట్టీలు తీసుకొని ఆమెను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు.

ఇది గమనించినవారు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.