Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలు!

*చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు కల్పిస్తున్న ప్రభుత్వం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 5,(నిజం న్యూస్) బ్యూరో ::

పంటనష్టం పరిశీలించకుండా ప్రభుత్వం చంద్రబాబుకి ప్రతికూలంగా అడుగడుగునా ఎన్నో కుయుక్తులను పన్నుతోంది. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు

చంద్రబాబు పొలాల్లోకి వెళ్లకుండా ఎక్కడికి అక్కడ అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో దుశ్చర్యలకు పూనుకుంటుంది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెగాయమ్మపేటతో సహా పలు ప్రాంతాల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది.

Also read: ప్రభుత్వం మెడలు వంచైనా గిట్టుబాటు ధర ఇప్పిస్తా

అలాగే చంద్రబాబు ప్రచార రథం వాడేందుకు అనుమతి లేదంటూ ఒకపక్క పోలీసులు పోలీసులు అడ్డంకులు చెబుతున్నట్లు సమాచారం.కాన్వాయ్ తో ప్రచార రథం కదిలిస్తే సీజ్ చేస్తామంటున్న పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.అవసరమైతే పొలాలకు నడుచుకుంటూ వెళ్లాలనే చంద్రబాబు టిట్ ఫర్ టేప్ గా ఉన్నారు.