Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ స్వామివారిని దర్శించుకుంటే పాపాలు పోతాయన్న నమ్మకం

నేడే కాల్వ నరసింహుడి కళ్యాణం

కోరిన కోరికలు తీర్చే నరసింహస్వామి
రుతుపవనాలకు అనుగుణంగా మరి కోనేరులో నీరు
ఆలయ వెనుక భాగంలో ప్రాచీన అడవి ప్రాంతంలో గుట్ట
పిలిస్తే పలికే ఉషన్న పల్లె
గరుడ ముద్దలతో పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి
ఒక సంవత్సరంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 04
(నిజం న్యూస్)
నిర్మల్ జిల్లాలో ప్రత్యేక పేరు గాంచిన కాల్వ గ్రామంలో కొలువు దీరిన నరసింహుడిగా ఆలయం నిర్మల్ జిల్లా నుండి పది కిలోమీటర్ల దూరంలో దిలావర్ పూర్ మండల్ కాల్వ గ్రామంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఈ యొక్క నరసింహస్వామి ఆలయం కలదు.

ఈయొక్క ఆలయంలో నేటి నుండి ఈనెల 13.05.2023 వరకు జరుగుతాయి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజు నిత్యర్జన అగ్ని ప్రతిష్ట యాగము అనంతరం గరుడ ముద్దులు వేస్తారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను చూడడానికి మహారాష్ట్ర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు

ALSO READ: 5 పరుగుల దూరం లో ఆగి పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

కోనేరు యొక్క ప్రత్యేకతలు
కాల్వ గ్రామం నుండి నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ముందుగా కోనేరు కలదు ఆ స్వామి వారిని దర్శించుకునే ముందు యొక్క కోనేరులో స్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు పోతాయని నమ్ముతారు ఈ యొక్క కోనేరులో రుతుపావనాలకు అనుకూలంగా కోనేరులో గల నీరు మూడు రంగులుగా కనిపిస్తాయి

పురాతన గుట్ట యొక్క ప్రత్యేకతలు
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వెనుక భాగంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఒక గుట్ట ఆ యొక్క గుట్టను పరీక్షించి చూడగా సింహం తల ఆకారంలో గుట్ట కనిపిస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం పుట్ట లోపల ఒక గుహ ఉన్నది ఆ యొక్క గుట్టలో కొలువుదీరిన నరసింహస్వామి కి సంవత్సరంలో రెండుసార్లు పూజలు నిర్వహిస్తారు

ఒకటి మహాశివరాత్రి సందర్భంగా మరొకటి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవ లో భాగంగా పూజలు నిర్వహిస్తారు యొక్క ఉత్సవాల సందర్భంగా వారం రోజులపాటు దేవస్థానం వద్ద తపస్సు చేసుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం

అట్టి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు పాల్గొని తమ శక్తి సమర్పించి కఠిన కానుకలు ధన ధ్యాన వస్తు కానుకలు సమర్పించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ పండితులు శ్రీమాన్ చక్రపాణి శ్రీనివాసచార్యులు తెలిపారు

పిలిస్తే పలికే ఉషన్న భక్తుడు

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక భక్తుడు ఉష అన్న పల్లె ఉంది ఆ యొక్క మందిరం లోపలికి వెళ్లి అక్కడ ఉషన్న అని పిలవగా భక్తుడు ఉషన్న పలుకుతాడని భక్తుల యొక్క నమ్మకం