Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అడవి శేష్ “మేజర్” సినిమాలో సల్మాన్ హీరోయిన్

అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మేజర్‌’. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరుడైన ఎన్ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్‌ను అడివి శేష్ పోషిస్తుండగా, ‘గూఢచారి’ హీరోయిన్ శోభిత ధూళిపాళ ఓ ముఖ్య పాత్రను చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలకపాత్రధారిని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సల్మాన్ ఖాన్ సరసన ‘దబంగ్ 3’లో నటించి, అందరి దృష్టినీ ఆకర్షించిన సయీ మంజ్రేకర్ (నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె) ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నారు. ఇప్పటి వరకు 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ‘మేజర్’ మూవీని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2021 సమ్మర్‌లో ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.