Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాల్ డైవర్షన్ యాక్టివేట్ తో జాగ్రత్త

కాల్ చేసే [401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా జాగ్రతగా ఉండండి.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్

మహబూబాబాద్ బ్యూరో మే 4 నిజం న్యూస్

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు చేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డ్రైవర్షన్ యాక్టివేట్ చేయిస్తూ, వారి వాట్సప్ తమ ఆధీనంలోకి తీసుకుని డబ్బులు -అత్యవసరంగా పంపమని కోరుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు బాధితులకు సర్వీస్ సెంటర్ జియో ఎయిర్టెల్ ఐడియా బిఎస్ఎన్ఎల్ నుండి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ సర్వీస్ల లో ఇబ్బందిపై కాల్ సెంటర్కు ఫిర్యాదు చేశారా..? అని అడుగుతూ, బాధితులు అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని చెప్పిన వెంటనే సైబర్ నేరగాళ్లు తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని దానిని క్లోజ్ చేయాలి కాబట్టి మీరు వెంటనే (401) తర్వాత 598 42 అనే ఫేక్ నంబర్ ను జోడించి డైల్ చేయాలని సూచిస్తాడు.

ALSO READ: TS ICET-2023 పరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం

ఒకవేళ అలా మీరు చేసినట్లు అయితే వెంటనే మీ ఫోన్ లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు రావాల్సిన కాల్స్ అన్నీ సైబర్ నేరగాళ్లు సూచించిన ఫేక్ 598 42 నంబర్కు వెళ్తాయి.

అదే విధంగా ఫేక్ నెంబర్ తో మీయొక్క వాట్సాప్ ను నైబర్ నేరగాళ్ల ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటారు. తద్వారా వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్న అందరికి అత్యవసరంగా రూ.2000 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా ఫేక్ 698 42 నంబర్ కు పంపాలని చెప్పి డబ్బులు లాగేస్తారు.

ఇలా కొత్త కొత్త ఉపాయాలతో సైబర్ మోసాలు చేస్తున్నారు. ‘ జాగ్రత్తలు.
401తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్కు కాల్ డ్రైవర్లన్ యాక్టివేట్ అయిపోతుంది.

దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్లోని కాల్ సెట్టింగ్స్లో లోకి వెళ్లి సెట్ చేసుకోవాలి.
అపరిచితుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మకూడదు వాళ్లు చెప్పినట్లు చేయకూడదు.

ఫోన్ ఎవరికైనా ఇవ్వవలసిన పరిస్థితి వస్తే వారికి తెలియకుండా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఇవ్వాలి. వారు మన ఫోన్లో ఏం చేసినా మనం తెలుసుకోవచ్చు.