అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బిఎస్పీ
అంబేద్కర్ ఆశయ సాధన కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ బిఎస్పీ
తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మే 7 న జరగబోయే తెలంగాణ భరోసా సభనువిజయవంతం చేయాలి
బహుజనులు ఆశా జ్యోతి అక్క మాయావతి కి ఘన స్వాగతం పలకాలి.
– బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ మే4 నిజం న్యూస్
తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 7వ తేదీన జరగబోయే తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్లను బుధవారం నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ మే 7వ తేదీన జరగబోయే తెలంగాణ భరోసా సభకి ముఖ్యఅతిథిగా బహుజనుల ఆశాజ్యోతి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ముఖ్యఅతిథిగా వస్తున్న సందర్భంగా బహుజనులందరూ ఏకమై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ALSO READ: ప్రజలకు పట్టపగలే చుక్కలు
అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కావున బహుజనులంతా ఈ సభను కుటుంబంలో జరుగుతున్న పండుగల భావించి తండోపతండాలుగా తరలివచ్చి అక్క మాయావతి కి ఘన స్వాగతం పలకాలని బహుజనులకు మనవి చేశారు
.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర కార్యదర్శి నర్ర నిర్మల, జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు,జిల్లా ఈసి మెంబెర్ గ్యార మారయ్య,నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్,నియోజకవర్గ కార్యదర్శి శృతి నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కూమర్,రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్,కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల ఉపాధక్షులు గ్యార శేఖర్,ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కోశాధికారి మునుగోటి సత్తయ్య, రామన్నపేట ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, కార్యదర్శి నకిరేకంటి సతీష్, కోశాధికారి గట్టు రమేష్, మండల నాయకులు అవిరెండి పరుశురాములు, జిట్ట నర్సింహా రాజు, గాదె ఎల్లేష్, జిట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు….