Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజలకు పట్టపగలే చుక్కలు

సామాన్యులకు ధారాఘాతం
పెరుగుతున్న సరకుల ధరలు
చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతన్న నిత్యావసరాల ధరలు సామాన్య,మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్‌.. ఇలా అన్నింటి ధరలు అందనంతగా పెరిగిపోతున్నాయి. వీటికి తోడు మందుల ధరలు కూడా సైలెంట్‌గా పెంచేశారు.

గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు దాడి చేస్తున్నాయి. పెట్రో ధరలతో అన్నిరకాల వస్తువుల ధరలు దాదాపు రెండిరతలు అయ్యాయి. చాయ్‌ సింగిల్‌ కనీసం 15 రూపాయలుగా అమ్ముతున్నారు. మూడేళ్లలో నెలసరి ఇంటి ఖర్చులు ఏకంగా 5 వేలు దాటేశాయి. ఈ ధరాఘాతంతో బతకలేక సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.

ఈ ధరలకు తోడు కరెంటు బిల్లులు, పెట్రోల్‌ బాదుడు కూడా అదనంగా వచ్చి చేరింది. ప్రభుత్వాలు ధరలను అరికట్టే చర్యలకు పూనుకోవడం లేదు. ధరలు పెరగడం సహజం అన్న ధోరణిలో ఉన్నారు.

ALSO READ: మద్యం మత్తులోనే నేరాలు

తమకు అందుబాటులో ఉన్న పెట్రోల్‌, గ్యాస్‌, విద్యుత్‌ తదితర వస్తువులపై వడ్డింపులు వేస్తూనే ఉన్నారు. దీనికితోడు జిఎస్టీ వడ్డింపులు శరాఘతంగా మారాయి. సామాన్యులు బతకడం దుర్లభంగా మారింది. ధరల పెరుగుదలను తలచుకుంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5వేలకు పైగా పెరిగింది. ప్రతి ఒక్కరిపైనా ఏటా 5 నుంచి 10 శాతం పెంపుతో అదనపు భారం తప్పదు. పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరవైంది. అటు పనుల్లేక, ఇటు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.

కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. కరోనా సమయంలో ధరలు భారీగానే పెరిగినా తర్వాత కాస్త నెమ్మదించాయి. కొంతకాలంగా నిలకడగా సాగుతున్నాయి. గతంలో 3 నెలలకు రూ.333 ఉండే రీఛార్జ్‌.. ఇప్పుడు రూ.666కు చేరింది. దీనికి తోడు వై`్గª రూపంలో నెలకు రూ.500 వరకు అదనపు భారం తప్పట్లేదు.

కేబుల్‌ టీవీ ఖర్చు రూ.250 వరకు అదనం. ఒక్కో ఓటీటీ ఛానెల్‌కు సగటున రూ.500 చొప్పున నాలుగు తీసుకున్నా.. రూ.2 వేలు. అంటే నెలకు రూ.166 చొప్పున ఖర్చవుతుంది. ఒక్కో కుటుంబంపైనా మొబైల్‌, కేబుల్‌ బిల్లుల రూపంలోనే నెలకు రూ.600 వరకు అవుతోంది. వై`ఫై, ఓటీటీ తీసుకున్న కుటుంబాలకు నెలకు రూ.1,000 చొప్పున తప్పట్లేదు.

ALSO READ: కళ్ళం లో ధాన్యం.. అన్నదాత కళ్లల్లో దైన్యం

2019 మధ్యలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.600 వరకు ఉంది. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1150అయింది. అప్పటితో పోలిస్తే రాయితీ కూడా తగ్గిపోయింది. రూ.15 చొప్పునే నామమాత్రంగా ఇస్తున్నారు. నెలకు ఒక సిలిండర్‌ లెక్కన చూస్తే.. ఒక్కో కుటుంబంపై రూ.372 చొప్పున భారం పడుతోంది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల గురించైతే చెప్పనక్కర్లేదు.

చిరు వ్యాపారులు, ప్రైవేట్‌ ఉద్యోగులకు ద్విచక్రవాహనం భారమైపోయింది. నెలకు సగటున 25 లీటర్ల పెట్రోల్‌ లెక్కన చూసినా రూ.1,100 వరకు ఖర్చు పెరిగింది. 2019లో రూ.75లోపు ఉన్న పెట్రోల్‌ ధర.. ప్రస్తుతం రూ.121 వరకు చేరింది. లీటరుకు రూ.45కు పైగానే పెరిగింది.

ఇంజిన్‌ ఆయిల్‌ ధర రూ.300 నుంచి రూ.500కు చేరింది. ఇప్పుడు రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధంతో మరింత ఎగిశాయి. బ్రాండెడ్‌ టీపొడి ధర గతంలో కిలో రూ.540 ఉండేది. ప్రస్తుతం రూ.780 చొప్పున విక్రయిస్తున్నారు. అల్లం, యాలకులు, తులసి, అశ్వగంధ వంటి ఉత్పత్తులతో తయారయ్యే ఒక సంస్థ టీ పొడి.. 2019లో రూ.380 ఉండేది.

ప్రస్తుతం రూ.560కి చేరింది. లీటర్‌ పాల ధర గతంలో రూ.55 నుంచి రూ.58 మధ్య ఉండేది. ఇప్పుడు సగటున రూ.64 నుంచి రూ.68 వరకు ఉంది. నెలకు 30 లీటర్లకు రూ.300 అదనంగా ఖర్చవుతోంది.

సబ్బులు, డిటర్జెంట్‌ ఉత్పత్తుల ధరలూ.. 30 శాతం వరకు పెరిగినట్లు అంచనా. వీటికి తోడు ఇంట్లో వాడే ఒంటి సబ్సులు,ఫేస్‌క్రీమ్‌, షాంపూ ధరలూ రెట్టింపయ్యాయి. పాత్రలు కడిగే సబ్బు ధర మూడేళ్ల కిందట రూ.45 ఉంటే ఇప్పుడు అది 51 శాతం పెరిగి.. రూ.68కి చేరింది.

టూత్‌పేస్ట్‌ ధర 2019లో రూ.79 ఉంటే.. ఇప్పుడు రూ.96 రూపాయలకు పైగానే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల వస్తువులపైనా ధరలు పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 25కిలో దగగ్గర స్థిరంగా ఉన్నాయి.