Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అవినీతి

ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రభుత్వం

• ముంపు బాధితులకు 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయం చేయాలి.

• ఔటర్ రింగు రోడ్డు లీజ్ పై కేటీఆర్ సమాధానం చెప్పాలి…

కాంగ్రెస్ పార్టీ సి.ఎల్.పి నేత బట్టి విక్రమార్క

భువనగిరి ఇంఛార్జి మే 03(నిజం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్గ ఆరోపించారు.

బుధవారం కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్గ అదిలాబాద్ నుండి కొనసాగిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో బస్వాపురం గ్రామం చేరుకున్న సందర్భంగా ప్రాజెక్ట్ భూమి కోల్పోయిన రైతులు, లప్ప నాయక్ తండ, బి ఎన్ తిమ్మాపూర్ రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో రైతుల కోసం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బస్వాపురం రిజర్వాయర్లో 1100 ఎకరాల భూమికి కేవలం 400 ఎకరాలకే డబ్బులు ఇచ్చారని, ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారిని అన్యాయంగా పోలీసుల చేత నిర్బంధించి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ALSO READ: మహిళ ప్రాణాలు కాపాడిన  బ్లూ కోల్ట్స్

టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రాజు లాగా నియంతలాగా పరిపాలన సాగిస్తూ ప్రజల నుంచి రాక్షసంగా భూములు దౌర్జన్యంగా వ్యవహరి లాక్కున్నారని ఆరోపించారు. ప్రజలు భూములు పోతుంటే కొట్లాడలేక ప్రభుత్వం తో పోరుబడలేక తీవ్రంగా ఇబ్బందులు చాలా అవస్థలు పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎకరం 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉందని చెప్పిన సీఎం, ఆయన చెప్పిన ప్రకారం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఎకరానికి మూడింతలు అనగా కోటి 50 లక్షలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కనీస ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారమైన తిమ్మాపురం గ్రామస్తులు తమ భూములతో పాటు గ్రామాన్ని కోల్పోతున్నందున వారికి యధావిధిగా ఊరుని నిర్మించి ఇవ్వాలని, ఆ ఊరిలో బడి , గుడి, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించి ఇవ్వాలన్నారు.చేతి వృత్తిదారులకు చట్టప్రకారం న్యాయం చేయాలన్నారు.

ధరణి పోర్టల్ సమస్య వలన తిమ్మాపురం గ్రామంలో వందల సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న వారికి డబ్బులు ఇవ్వకుండా రెవిన్యూ అధికారులు దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నవాబుల కాలం నాటి భూమిని గ్రామ రైతులు సేద్యం చేసుకుంటూ జీవో ఉపాధి చేస్తున్న క్రమంలో ఆ కొంత ఉన్న భూమి కూడా ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కొని రైతులు బ్రతుకులు దిక్కుతోచని హినస్థితిలో జీవిస్తున్నారని ఆరోపించారు.

ALSO READ: అప్పుడే ఎండ .. అంతలోనే వాన .. అన్నదాతకు విషమపరీక్ష

2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రచార ఆర్భాటాలు తప్ప ఎక్కడ కూడా ఇంచు భూమికి నీరు ఇచ్చిన దాఖలాలు లేవని, ఈ విషయంపై తమ ఎక్కడికైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.దళితులకు మూడెకరాల భూమి,ఇంటికో ఉద్యోగం, నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీరు, ప్రతి నియోజకవర్గంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు మూడు విద్యాలయాల ఏర్పాటు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆ ఉద్యమాన్ని ఓట్ల రూపంలో మరల ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి మణిహారం అని అలాంటి రోడ్డును 30 సంవత్సరాల పాటు లీజికి ఇవ్వడాన్ని దుర్గా దుర్మార్గమైన చర్యగా వర్ణిస్తూ, వెంటనే లీజును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై కోర్టులో న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 30 సంవత్సరాలు లీజు ఇవ్వడం పై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ప్రజలు ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలంటే ఇందిరామ రాజ్యం రావాలని దొరల పాలన పోవాలని నినాదాలు చేస్తున్నారన్నారు.

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, పార్లమెంటు బిల్లులు పాస్ చేసినప్పుడు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. కెసిఆర్ కు కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలో పనిచేస్తుందన్న ప్రధానమంత్రి మోడీ, భారత హోం శాఖ మంత్రి అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వీరి రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడు దుల నగేష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గౌడ్, టీపీసీసీ సభ్యులు తంగెలపల్లి రవికుమార్,వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, బీసుకుంట్ల సత్యనారాయణ,గ్రామ సర్పంచ్ పినం లత రాజు, మాజీ ఎంపిటిసి జిన్న మల్లేశం, వాకిటి అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ రావుల అనురాధ నందు, పాక వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.