Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అప్పుడే ఎండ .. అంతలోనే వాన .. అన్నదాతకు విషమపరీక్ష

-ప్రకృతి పగపట్టినట్లుగా శిక్ష !!!

తూర్పుగోదావరి జిల్లా(బిక్కవోలు మండలం )
మే3,నిజం న్యూస్..

వ్యవసాయం అనేది ప్రకృతితో ఆడే జూదం అన్న చందాన తయారయ్యింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం.

అప్పుడే చండ ప్రచాండంగా ఎండ,అంతలోనే ఆకాశానికి చిల్లులు పడ్డట్లు జోరు వాన.. ఎండ ఉంది కదా అని ధాన్యం ఆరబెడదాం అని రైతాంగం ఊపిరి పీల్చుకుని ధాన్యం రాశి విడదీస్తే వరుణుడు పగబట్టినట్లు విరుచుకుపడటంతో ధాన్యం మొత్తం నీటిలో తడిసి ముద్ద అవుతుంది.

ఇప్పటికే ధాన్యం అమ్మాలంటే తలకు రోకలి చుట్టినట్లు లెక్కకు మించి నిబంధనలు పెడుతున్న అధికారులు ఈ తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారు అనుకోవడం ఇసుక నుండి నూనె తీయడం లాంటిదే అని రైతాంగం ఆవేదనకు గురి అవుతున్నారు.

ALSO READ: కర్నూలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాత ఆస్తులపై ఏసీబీ దాడులు

అర్ధాంతరంగా విరుచుకుపడుతున్న వానకు జడిసి రైతులు ధాన్యంఆరబెట్టే సాహసంచేయలేకపోతున్నారు.అలాగే ఇంకా వరి కోతలు కూడా పూర్తి కాని నేపథ్యంలో మిగతా వరి కోతలు ఎప్పుడు పూర్తి చేయాలో దేవుడా!అని రైతులు తల్లడిల్లుతున్నారు.

ఈలోపు ఈ నెల 5 లేదా 6తేదీలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన రైతులకు ప్రాణసంకటంలా మారింది.ఏది ఏమైనా మట్టిని నమ్ముకున్న తమకు ప్రకృతి అన్యాయం చేయాదనే నమ్మే రైతులు ఇలా ప్రకృతి తమ మీద ఎదురు దాడి చేయడం చూసి అమ్మ కొట్టిన పసిపిల్లలు మాదిరిగా మౌనంగా రోదిస్తున్నారు.