Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కర్నూలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాత ఆస్తులపై ఏసీబీ దాడులు

కర్నూలు మే 3 (నిజం న్యూస్)

కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయంలో పని చేస్తున్న
అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాత ఆస్తులపై ఏసీబీ దాడులు.సుజాతకు చెందిన ఇల్లు, తోపాటు కర్నూలు నగరంలోని ఐదు ప్రాంతలలో ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.సుజాత నుండి ఏసీబీ అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు

ALSO READ: మేడారం సమ్మక్క సారక్క జాతర తేదీలు ఖరారు
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక జి+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక జి+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఒక ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్లో జి+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు
ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ తెలిపింది