Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మేడారం సమ్మక్క సారక్క జాతర తేదీలు ఖరారు

మే 3 నిజం న్యూస్ ప్రతినిధి ఏటూరునాగారం:

ఆసియా ఖండంలోనే గిరిజనుల జాతరగా పేరుగాంచిన ఆదివాసుల ఇలావేల్పు శ్రీ మేడారం సమ్మక్క సారక్క ల మహా జాతర తేదీలను పూజరులు ఖరారు చేశారు.

తేది 14-2-2024 రోజున మాఘ శుద్ధ పంచమి బుధవారంమండమేలాగడం మరియు గుడి శుద్ధీకరణ,21-4-2024 న మాఘ శుద్ధ ద్వాదశి సాయంత్రం గుడి మెలాగడం.22-2-2024 రోజున వనం ఉదయం 8 గంటలకు గద్దెలమీదకు వచ్చుట.

ALSO READ: నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

సాయంత్రం 6 గంటలకు సమ్మక్క దేవత గద్దెలమీదకు వచ్చుట, తేదీ 23-2-2024 శ్రీ సమ్మక్క సారక్క దేవతలు మరియు గోవిందరాజులు ,పగిదిద్దరాజుల దేవుళ్లలకి భక్తులు మొక్కులు చెల్లించుట,24-2-2024 రోజున సమ్మక్క సారక్క ,గోవిందరాజులు,పగిదిద్దరాజులు వన ప్రవేశం చేయుట.

28 తేదీన తిరుగువారం పండుగ చేస్తారని పూజారులు అన్నారు