Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహిళలకు విస్తృతమైన వైద్య సేవలు

ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా మహిళలకు విస్తృతమైన వైద్య సేవలు..
జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఇలా త్రిపాఠి..
రిఫరల్ కేసులను ఆశా కార్యకర్తలు ఫాలో అప్ చేసేలా కార్యాచరణ..

ములుగు జిల్లా ప్ర‌తినిధి, నిజం న్యూస్‌, మే 2:-
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా జిల్లాలో ఉన్న మహిళలకు విస్తృతమైన వైద్య సేవలు అందించాలని
జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సంద‌ర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళలతో మాట్లాడుతూ, మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు ఆరోగ్య మహిళా కేంద్రాలు దోహదపడతాయని అన్నారు.

ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఇంటి వద్ద ఆరోగ్య మహిళా కేంద్రం కర పత్రం అందజేయాలని , మహిళలందరికీ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు.

ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళలందరికీ జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, ప్రతి మహిళకు తప్పనిసరిగా జనరల్ డయాగ్నొస్టిక్, థైరాయిడ్, అనీమియా, సూక్ష్మ పోషక లోపాల పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని, కేసు తీవ్రతను బట్టి రిఫర్ చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

క్యాన్సర్ వ్యాధుల నియంత్రణకు ప్రతి మహిళకు తప్పనిసరిగా ఓరల్, రొమ్ము క్యాన్సర్ క్లినికల్ పరీక్ష చేయాలని అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఆరోగ్య కేంద్రాలకు వచ్చే 55 పైగా వయసు గల మహిళలకు తప్పని సరిగా బీ12 లోపం పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్ లో పకడ్బందీగా నమోదు చేయాలని, యాప్ లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు.

ALSO READ : 58, 59 క్రింద భూ క్రమబద్ధీకరణకు మే 31 వరకు దరఖాస్తులను సమర్పించాలి

అవసరమైన వైద్య చికిత్సల కోసం రిఫరల్ చేసిన కేసులను ఆశా కార్యకర్తల ద్వారా ఫాలోఅప్ చేయాలని ఆమె సూచించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు నూగురు వెంకటాపురంలో 556 స్త్రీలను పరీక్షించి 50 మందిని ములుగు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగిందనీ, అలాగే ట్రీట్మెంట్ పూర్తయిన వారి సంఖ్య 19 తెలంగాణ హబ్బకు పరీక్షల నిమిత్తం పంపించిన పేషెంట్ సంఖ్య 89 బదిలీయడం జరిగింద‌ని వైద్యాధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఎంఅండ్ హెచ్ ఓ అప్పయ్య, జడ్పిటిసి వెంకటరమణ, సర్పంచ్ యామిని, ఎమ్మార్వో నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎస్‌ఐ. తిరుపతిరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.