జియో సంచలనం … 22 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో మొబైల్ సేవలు

రిలయెన్స్ జియో యూజర్లకు మరో గొప్ప శుభవార్త. 22 ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించింది. రిలయెన్స్ జియో. ఒక రోజుకు రూ.499 నుంచి ప్లాన్స్ ప్రారంభమౌతాయి. క్యాథే పసిఫిక్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, యూరో వింగ్స్, లుఫ్తాన్సా, మలిండో ఎయిర్, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, అలిటాలియా ఎయిర్‌లైన్స్‌తో రిలయెన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇన్ ఫ్లైట్ సర్వీస్ అందిస్తున్న రెండో భారతీయ టెలికామ్ కంపెనీ రిలయెన్స్ జియో. టాటా గ్రూప్‌కు చెందిన నెల్కో లండన్ రూట్‌లో విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఇన్-ఫ్లైట్ మొబైల్ సర్వీస్‌ను గతంలో ప్రారభించింది. ఇక రిలయెన్స్ జియో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మూడు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ అందిస్తోంది. రూ.499, రూ.699, రూ.999 ప్లాన్స్ 1 రోజు వేలిడిటీతో లభిస్తాయి.