Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

58, 59 క్రింద భూ క్రమబద్ధీకరణకు మే 31 వరకు దరఖాస్తులను సమర్పించాలి

.
జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య..
మే 31 వరకు ప్రభుత్వ ఉత్తర్వు 58, 59 క్రింద నూతన దరఖాస్తులకు అవకాశం

ములుగు జిల్లా ప్ర‌తినిధి, నిజం న్యూస్ మే 2:- జీఓ నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు
మే 31 వరకు మీ సేవా ద్వారా దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ALSO READ: అరిగి పోయిన రికార్డ్ ఎన్నిసార్లు వేస్తావ్…
ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీ కరణకు 2014 జూన్ 02 కటాఫ్ తేదీ ఉండగా, దానిని 2020 జూన్ 02 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17వ తారీఖున ఉత్తర్వుల సంఖ్య 29ను జారీ చేసి, నూతనంగా భూ క్రమబద్దికరణకు దరఖాస్తు లు చేసుకునేందు కు అవకాశం కల్పించింద‌ని, మరో నెలరోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుందని మీ సేవా ద్వారా మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.