Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డబ్బుల వసూల్లే మావోయిస్టు పార్టీ లక్ష్యం

*పిరికిపంద చర్యలకు పాల్పడుతూ నీతులు వల్లిస్తున్న మావోయిస్టు పార్టీ : ఏఎస్పీ.. పరితోష్ పంకజ్

చర్ల మే 2 (నిజం న్యూస్)

ఉనికిని చాటుకోవడానికే మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసారు.

అభివృద్ధి నిరోధకులుగా మారి ఏజెన్సీ ప్రాంత అమాయకపు ఆదివాసీ ప్రజలపై మావోయిస్టులు వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను అమలు చేయడంలో భాగంగా వారికి విద్య,వైద్యం,ఆరోగ్యం అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని తెలియజేసారు.

డబ్బులు వసూల్లే లక్ష్యంగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ క్రింది స్థాయి కేడర్ తో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు.

తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు అమాయకులైన ఆదివాసీలపై అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు.తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లోని మైనర్ బాలబాలికలను,యువకులను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకొని వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలియజేసారు.

Also read: పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు

జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ చేయూత” ద్వారా ఆకర్షితులై నిషేధిత మావోయిస్టు పార్టీ నుండి బయటకు రావాలనుకుంటున్న దళ సభ్యులు, నాయకులను అగ్రనాయకులు వేధిస్తున్నారని తెలియజేసారు.