Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌… డీన్‌ జోన్స్‌ గుండెపోటుతో కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌… డీన్‌ జోన్స్‌ గుండెపోటుతో కన్నుమూశాడు. 59 ఏళ్ల డీనో.. ప్రస్తుతం ఐపీఎల్‌ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ముంబైలో ఉన్న ఆయనకు గత అర్ధరాత్రి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోగానే ఆయన తుది శ్వాస విడిచాడు. 1961 లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జన్మించిన డీన్‌ జోన్స్‌… ఆస్ట్రేలియా తరపున 52 టెస్టులు, 164 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. దూకుడైన బ్యాట్స్‌మెన్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా డీన్‌ జోన్స్‌ పేరు గాంచాడు. టెస్టుల్లో 3 వేల 631 పరుగులు చేసిన డీనో… వన్డేల్లో 6 వేల 68 పరుగులు సాధించాడు. 1986 లో భారత్‌తో జరిగిన టెస్టులో డీ హైడ్రేషన్‌తో బాధపడుతూ… డీన్‌ జోన్స్‌ మైదానంలోనే పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. అయినా పట్టు వదలకుండా బ్యాటింగ్‌ చేసి.. డబుల్‌ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఇన్నింగ్స్‌లో ఇదీ ఒకటిగా ఘనత సాధించింది.