Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వానికి పంట నష్టం పై శ్రద్ధ లేదు…ఆజాద్ పేరిట లేఖ విడుదల

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

*తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

*తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

*కౌలు రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలి

*అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ.(బి కే-ఏ ఎస్ ఆర్) ఆజాద్

చర్ల మే 2 (నిజం న్యూస్) అకాల వర్షాలకు రైతన్న ఆరుగాలం పండించిన పంట నీలపాలైంది వరుసగా కురుస్తున్న వర్షాలకు యాసంగి లో పండే పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది ప్రభుత్వం కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా రైతన్నను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బి కే ఏ ఎస్ ఆర్) ఆజాద్ పేరిట మంగళవారం లేక విడుదల చేశారు

తెలంగాణలో రైతాంగం పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ప్రవేట్ వ్యాపారస్తుల దగ్గర వడ్డేలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసి రైతులు చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాలకు దెబ్బతిని కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి కొందరు అసలే పంటలు కోయకుండా చేలన్నీ నేలమట్ట మై గింజ చేతికి రాక కంటతడి పెడుతున్నారని అప్పులు తీర్చలేక తడిసిన గింజ కొనే నాథుడు లేక తీవ్ర మనస్థాపనకు గురై నిశ్శహాయులుగా మిగిలిపోయారని లేఖలో పేర్కొన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టాన్ని ఏరియల్ సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని పంట నష్టం ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని ఇప్పటికీ అధికారులు పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించలేదని లేఖలో పేర్కొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల వరి మొక్కజొన్న మిర్చి వేరుశనగ పసుపు మామిడి జీడి మామిడి తో పాటు కూరగాయలు పంటలు తీవ్రంగా నేలపాలైనట్లు ప్రభుత్వం మే చెప్తుందని సుమారు 1.5 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనాలు ఎప్పటికీ క్షేత్రస్థాయిలో పెరిగే అవకాశం లేకపోలేదని లేఖలో తెలిపారు

Also read: తిరుమలగిరిలో దళిత బందు లబ్ధిదారులకు శఠగోపం

ప్రభుత్వానికి పంట నష్టం పై శ్రద్ధ లేదని కాకి లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఎకరానికి 10.వేలు చెల్లించేందుకు 228 కోట్లు మంజూరు చేసినట్లు కేసిఆర్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ పరిహారం రైతులకు చేరకపోవడం బాధాకరమని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చెల్లించాలని తడిసిన ధాన్యం గింజతోపాటు ఇతర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పౌలు రైతులను గుర్తించి వారికి పంట నష్ట పరిహార అందించాలని ప్రభుత్వ భూముల్లో పంటలు సాగు చేసే సన్నాసిన్నా కారు రైతులను గుర్తించి వారికి పంట నష్టపరిహారం అందించాలని.

రైతులు సంఘటితంగా ఉండి పంట నష్టపరిహారం కోసం పోరాడాలని లేఖను ఆజాద్ పేరిట లేఖ విడుదల చేశారు