Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తిరుమలగిరిలో దళిత బందు లబ్ధిదారులకు శఠగోపం

అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై.. దొరికిన కాడికి దోచుకున్నారని …లబ్ధిదారుల ఆవేదన..

పైలెట్ ప్రాజెక్టుపై జరిగిన అవినీతిపై, సిబిఐ చేత విచారణ జరిపించాలని వివిధ పార్టీ నాయకులు, లబ్ధిదారుల డిమాండ్.

హైదరాబాద్ ఏప్రిల్ 2 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిలో భాగంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని దళిత బంధు పథకంతో ప్రతి లబ్ధిదారునికి 10 లక్షల రూపాయలను బ్యాంక్ అకౌంట్లో జమ చేసి, లబ్ధిదారుడు అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో మొట్టమొదటిసారిగా తిరుమలగిరి మున్సిపాలిటీ 2500 యూనిట్లు వివిధ రంగాల్లో గాను ప్రవేశపెట్టారు… దీనితో స్థానిక అధికారులు, అధికార పార్టీ నాయకులతో మమేకమై ఏకంగా రంగ ప్రవేశం చేసి లబ్ధిదారుల పేర్లను వీళ్లే స్వయంగా ప్రకటించి ,సంబంధిత అధికారులకు లిస్టును పంపారు…

ఇంకేముంది… లబ్ధిదారునికి ఏది కావాలో ఏది వద్దు కనీసం అడగకుండానే వీరే దరఖాస్తు ఫామ్ నింపి ఆన్లైన్ చేయించి, ఒక్కొక్క యూనిట్కు 30 నుంచి 40% నిధులు మలుచుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు మొదట వచ్చిన యూనిట్ను మార్చుకున్నారు.

Also read: ఖర్చులకు అయిన డబ్బులను వెంటనే ఇప్పించండి…..ప్లీజ్

డైరీ యూనిట్లు తీసుకున్న లబ్ధిదారుల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది.1,50,000 తో షెడ్యూల్ ఏర్పాటు చేస్తామని, కేవలం 60 వేల రూపాయలు మాత్రమే షెడ్లు వేశారని, ఆంధ్రాకు వెళ్లి గేదెలను కొందామని చెప్పి 8 గేదెలను చూపించి ఫోటోలు తీసుకుని కేవలం,నాలుగు గేదెలు మాత్రమే ఇచ్చారని.. మిగతా 4 లక్షల 36 వేలకు, కేవలం 90 వేలు మాత్రమే ఇస్తామనగా మాకొద్దు అని లబ్ధిదారులు ఘర్షణకు దిగి, ఆగిపోయింది.

ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అవినీతిలో ఎవరు ఉన్నా, ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని ముక్తకంఠంగా చెప్పడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు, తమకు జరిగిన అన్యాయాన్ని, అవినీతిని ,పలువురు తమ బాధను మీడియా సోదరులకు వెలబుచ్చారు. దీనితో ఒకసారి గా జిల్లాలో దళిత బంధు ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయట పడ్డది.

జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన అధికారులు, సంబంధిత ప్రజాప్రతినపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, జరిగిన అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని, లబ్ధిదారులు, వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.

పైలెట్ ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించాలి..

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబ.

తిరుమలగిరి, దళిత బంధు పైలెట్ ప్రాజెక్టులో సుమారు 2500 మంది దళితులకు అవకాశం వచ్చినది. ప్రాజెక్టులో అధికారులు అధికార పార్టీ నాయకులు అండదండలతో లబ్ధిదారులు మోసం చేశానని ఆరోపించారు.

సుమారు ఒక్కొక్క లబ్ది దారు నుండి 30 నుంచి 40 శాతం నిధులు మింగారు. కనీసం లబ్ధిదారుల సంతకం కూడా పెట్టకుండా, పూర్తిగా నియమ నిబంధనలను అధికారులు తుంగలోద్రొక్కి ,మోసం చేసినట్లు తెలిపారు. జరిగిన సంఘటన, కోట్ల అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించి, పేద దళిత లబ్ధిదారులకు, న్యాయం చేయాలని కోరుతున్నారు…