Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఖర్చులకు అయిన డబ్బులను వెంటనే ఇప్పించండి…..ప్లీజ్

*గ్రామములోని ప్రజా అభివృద్ధి పనుల కొరకు అయిన ఖర్చుల వెంటనే ఇప్పించండి..*

 

*పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్..*

భువనగిరి ఇంఛార్జి మే 01(నిజం న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రామములోని ప్రజా అభివృద్ధి పనుల కొరకు అయిన ఖర్చుల వెంటనే ఇప్పించండి అని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుండి అనగా 2019 ఫిబ్రవరి 2వ నుండి ఇప్పటివరకు ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ పంచాయితీ పెద్దకందుకూరు పాలక వర్గం తీర్మాణం ప్రకారం గ్రామములో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరా కొరకు బోరుబావులు త్రవ్వడం/ఫ్లెషింగ్ చేయడం నూతన బోరు మోటార్లు బిగించడం అదను పైపు లైను వేయడం,

Also read: నన్ను కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నాడు..

గ్రామములో నీటి పైపులైను జామ్ అయినప్పుటు లేబర్తో త్రవ్వించి అదనపు పైపులైన్ ఫిట్టింగ్ చేయడం, చెడిపోయిన ప్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్ బాగు చేయడం, సి.సి. రోడ్లు వేయడం, గ్రామములో అంతర్గత మురుగు కాలువలు ఏర్పాటు చేయడం, 5వ హరితాహారం, 6వ హారితాహారంలో భాగంగా నర్సరీని ప్రైవేటు స్థలం నుండి గ్రామ పంచాయితీ స్థలంలోనికి మార్చనైనది.

అలాగే గ్రామములో విరివిగా మొక్కలను నాటడం జరుగుచున్నది. గ్రామములోని సిబ్బంది. జీతభత్యాలు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుచున్నది. గ్రామములో విద్యుత్ పనులు చేయించడం జరుగుచున్నది అని తెలిపారు.