Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నన్ను కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నాడు..

*తల్లిదండ్రులు లేని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న కార్యదర్శి పై కఠిన చర్య తీసుకోవాలి…*

*నా తాతాల, తల్లిదండ్రుల కాలం నుండి ఉన్న ఇంటి స్థలాన్ని ఇప్పించండి…*

భువనగిరి ఇంఛార్జి మే 01(నిజం న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలము వెలువర్తి గ్రామానికి చెందిన కూచుమల్ల దుర్గ సోమవారం అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. వివరాల్లోకి వెళ్లితే నా..తాతల కాలం నుండి నివాసం ఉంటున్న ఇంటి స్థలానికి ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటూ నన్ను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్న గ్రామ కార్యదర్శి పైన చర్య తీసుకోవాలి అని వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన కూచుమల్ల దుర్గ అన్నారు.

సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలో తన తాతల కాలం నుండి ఇంటి నిర్మాణాన్ని చేసుకొని నివాసం ఉన్న 260 గజాల స్థలంలో నా..తల్లిదండ్రులు బ్యాంకు రుణం పొంది పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేశారని

Also read: బిఆర్ఎస్ పాలనకు… నిజాం పాలనకు తేడా లేదు

అటు తరువాత తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందగా నేడు తన నానమ్మ ద్వారా ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ కార్యదర్శి అనుమతికి దరఖాస్తు చేసుకోగా నీ కుల సభ్యులందరి చేత నీది ఇల్లు అని సంతకం చేయించి నా ముందు పెడితే నీ ఇంటికి అనుమతి ఇస్తానని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ముందుగా తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్, లాయర్ ద్వారా అపిడవిట్ తదితర డాక్యుమెంట్లు తీసుకురమ్మనగా అందజేశానని, అయినా కులం వారితో సంతకాలు కావాలనే దురుద్దేశంతో నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అధికారులు స్పందించి కార్యదర్శి పైన చర్య తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాకు జరిగిన అన్యాయం పై న్యాయం చేయమని అధికారులను కోరడం జరిగింది అని తెలిపారు.