బిఆర్ఎస్ పాలనకు… నిజాం పాలనకు తేడా లేదు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఆలేరు మే 1 (నిజం న్యూస్)
బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 46వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని కొలనుపాక కు చేరింది
ఈ సందర్బంగా కొలనుపాక లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ తినడానికి తిండి లేక ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజలను హింసించి వారి సంపదను దోపిడీ చేసి ఆనాడు నిజాం రాజు రాజ భవనాలు నిర్మించినట్టుగానే ఈనాడు సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే వారి సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణ తలెత్తుకునే విధంగా సెక్రటేరియట్ నిర్మించామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఆలేరు వరకు కొనసాగిన తన పాదయాత్రలో అనేక గ్రామాల్లో ప్రజలు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, బీటెక్, ఎంటేక్, ఎంఎస్సీ, బీఈడీలు చదివిన విద్యార్థులు కొలువులు రాకపోవడంతో కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇబ్బందులు పడుతుంటే కెసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మాట్లాడటం బాధాకరమన్నరు,
ALSO READ: థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ రాకెట్…చికోటి ప్రవీణ్ అరెస్టు
తెలంగాణ ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపితే అప్పుడు తెలంగాణ సమాజం తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలబడిందని చెప్పితే బాగుండేదని నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కెసిఆర్ ను గద్దె దించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని,దేశంలోని విపక్ష పార్టీల అభ్యర్థుల పార్లమెంటు ఎన్నికలకు అయ్యే ఖర్చు తానే భరిస్తాననే స్థాయికి సీఎం కేసీఆర్ వెళ్లడం వెనుక తెలంగాణ సంపద ఎంత మేరకు దోపిడీ చేశారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తుండగా ప్రజల సంపద ప్రజలకే చెందాలని చేస్తున్న పోరాటమే ఈ పాదయాత్ర అని చెప్పుకొచ్చారు.అనేక మఠాలకు నిలయమైన కొలనుపాక నుంచి మన కొలువులు మనకే, మన సంపద మనకే చెందాలని మరో పోరాటానికి నాంది పలుకాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయని,తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుతున్న ప్రజల కోసమే తెలంగాణ వ్యాప్తంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ బీర్ల ఐలయ్య,మాజీ ఎమ్మెల్యే, జడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్,బండ్రు శోభారాణి,నీలం పద్మ వెంకటస్వామి,కల్లూరి రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరాజు,పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ.ఏజాస్, ఎంపీపీ కందమల్ల అశోక్,కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.