Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చేసిందే 126 పరుగులు.. గెలిచింది 18 పరుగులతో..

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది.

ఎల్‌ఎస్‌జి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తొమ్మిది వికెట్లకు 126 పరుగులకే పరిమితం చేసింది.

ఎల్‌ఎస్‌జీ 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది.

RCB టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 40 బంతుల్లో 44 పరుగులు చేశాడు,  విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేసాడు .

ALSO READ: తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ ఎన్నో అద్భుత ఘట్టాలు

నవీన్-ఉల్-హక్ LSG తరపున  నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్  నాలుగు ఓవర్ల ను వేసి,   2/21తో ఆకట్టుకున్నాడు.

ఎల్‌ఎస్‌జి తరఫున అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా, క్రునాల్ పాండ్యా నాలుగు ఓవర్లను వేసి  0/21 పరుగులను ఇచ్చాడు .

సంక్షిప్త స్కోర్లు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 126/9 (ఫాఫ్ డు ప్లెసిస్ 44; నవీన్-ఉల్-హక్ 3/30, రవి బిష్ణోయ్ 2/21)

లక్నో సూపర్ జెయింట్స్: 19.5 ఓవర్లలో 108 ఆలౌట్ (జోష్ హాజిల్‌వుడ్ 2/15 , కరణ్ శర్మ 2/20).