Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ ఎన్నో అద్భుత ఘట్టాలు

సమస్యలపై మరింత చిత్తశుద్దితో సాగాలి !
స్వరాష్ట్రం సాధనతో పాటు ..తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం అవుతున్నాయి. అయితే అందులో కొన్ని డాంబికాలు లేదా అసత్యాలు ఉన్నా..తెలంగాణ గతంకన్నా భిన్నంగా ముందుకు సాగుతోందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ప్రజలు ఆందోళన చెందుతున్న వివిధ అంశాలపైనా నిక్కచ్చిగా వ్యవహరించాల్సింది.

ఉమ్మడి ఎపితో పోలిస్తే ఇప్పుడున్న తెలంగాణ వేయిరెట్లు బెటర్‌ చెప్పుకోవాల్సిందే. కెసిఆర్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలు వేరు..అభివృద్ది వేరు. ఈ రెంటిని ఒకే గాటన కట్టి చూడరాదు. అవినతికి సంబంధించి ఆధారాలు ఉంటే చూపాలి. నిగ్గు తేల్చాలి. ఇకపోతే విడివడ్డ ఎపిలోతో కూడా సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించు కోవాలి.

నదీజలాలు కావచ్చు..ఆస్తుల పంపిణీ కావచ్చు..సమస్యలు ఏవైనా చర్చలకు ఆస్కారం ఉండాలి. ఎపి ప్రభుత్వం కూడా కూర్చుని సమస్యలను పరిష్కరించుకనే మార్గాలన వెదకాలి. నదీజలాలు, విద్యుత సమస్యలు తదితర అంశాలను చర్చించుకోవడం మంచిది.

తెలంగాణ అభివృద్దికి సంబంధించి అనేక ఘట్టాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలతో పాటు.. మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, రంగనాయక సాగర్‌ జలాశయాల నిర్మాణం అతిపెద్ద విజయంగా చూడాలి. వ్యవసాయకంగా ఇవి ఎంతో కీలకభూమిక పోషించేవిగా ఉన్నాయి.

ALSO READ: పలువురికి ఆదర్శ ప్రాయంగా ఆ యువకులు

మిసన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలో అతిశయోక్తులు ఉన్నా..అందులో కూడా కొంత నిజం ఉంది. ఇంటింటికి తాగునీరు వ్యవస్థ అన్నది ఇంకా పూర్తి కాలేదు. దీనిని ప్రభుత్వం చిత్తశుద్దితో ఒప్పుకోవాలి. అలాగే చెరువుల పూడికతీత కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినంతగా కదలిక లేదు. ఇందులోను అవకతవకలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవాలి. నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం,రోడ్ల ని`మాణంతో ట్రాఫిక్‌ చిక్కులు తగ్గాయని చెప్పాలి.

9 ఏళ్లలో ఎంత చేయాలో అంతకుమించి చేశారనే చెప్పాలి. ఇకపోతే సచివాలయ నిర్మానంతో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయాన్ని నిర్మిం చాలన్న సంకల్పంతో ఎన్నో ఆటెపోటుల్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడ నిర్మించాలన్న దానిపైనా తర్జన భర్జనలు జరిగాయి. అసెంబ్లీని కూడా అధునాతనంగా నిర్మించాలన్న సంకల్పం కెసిఆర్‌ వ్యక్తం చేశారు. అలాగే అధునాతన కళాభారతి నిర్మాణం కూడా సాకారం కావాల్సి ఉంది.

మొత్తంగా సచివాలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మించి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాల యంగా నామకరణం చేసి.. సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రులం దరూ తమ ఛాంబర్లలో కొలువుదీరారు. కీలక దస్త్రాలపై సీఎం కేసీఆర్‌, మంత్రులు సంతకాలు చేశారు. ముఖ్యంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడంతో ఆ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ALSO READ: బొండాలకు తప్పని గండాలు

డబుల్‌ ఇండ్ల మార్గదర్శకాలు, బల్దియా పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు ఫైళ్లపై ఆయా శాఖల మంత్రులు సంతకాలు పెట్టగా.. ఈ సందర్భంగా అర్చక సంఘాల నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కల సాకారం చేసుకోబోతున్న పేదల్లో సంతోషం వ్యక్తమైంది.

ఇక ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడి నెలకొంది. సాగర్‌లో సెక్రటేరియట్‌ నమూనాతో భగీరథ బోటు సందర్శకు లను కనువిందు చేసింది. రాత్రి వేళ..ఆకాశంలో బాణాసంచా మిరుమిట్లు గొలిపితే.. రంగురంగుల విద్యుద్దీ పాల కాంతులతో పాలనా సౌధం దేదీప్యమానంగా వెలిగిపోయింది.

తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ కూడా భాగమే. ఇదే విషయాన్ని కెసిఆర్‌ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక రాష్ట్రంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ పయనాన్ని సూటిగా, నీటుగా, దీటుగా, ఘాటుగా నివేదించారు. దశాబ్దాలపాటు దారిద్యాన్ని అనుభవించిన తెలంగాణ తొమ్మిదేండ్లలోనే సంపన్న రాష్ట్రంగా ఎలా అవతరించిందో ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు.

ఇక ఎవరు అవునన్నా కాదన్నా విద్యతు సరఫరా విషయంలో దేశంలో తెలంగాణ రోల్‌ మాడల్‌ అని చెప్పక తప్పదు. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి నుంచి.. పగటి పూటనే తెలంగాణ రైతు నీళ్లు పారించుకుంటున్నడు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియక జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో గడిపిన దుస్థితి నుంచి నిరంతరాయ వెలుగులతో తెలంగాణ విరాజిల్లుతున్నది.

చిన్నపెద్దా పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ ఊరటనిస్తోంది.అలాగే వైద్యరంగంలో గతం కన్నా ఎంతో పురోగతి సాధించాం. నలువైపులా సూపర్‌స్పెషాలిటీ దవాఖానలు, హెల్త్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీలతో వైద్యరంగం కొత్త పుంతలు తొక్కింది.

ALSO READ: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత

33 కొత్త జిల్లాలు, ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్లు, కొత్త జిల్లా పోలీస్‌ కార్యాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణ జరిగింది. నూతన పారిశ్రామి కవిధానం పెట్టుబడులను ఆకర్షిందిగా ఉంది. అన్నింటికి మించి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా రూపుదిద్దుకుంది. ఇలా అనేక విజయాలు సాధించినా మరెన్నో అపజయాలు కూడా ఉన్నాయి. పేపర్‌ లీకేజీలు వంటి సమస్యలను అధిగమించాలి.

దీనికి విమర్శలతో సమాధానం కాకుండా సమస్యకు కారకులైన వారిని గుర్తించిశిక్షించాలి. నిరుద్యోగ సమస్యకుచెక్‌ పెట్టాలి. దీనిని అతిపెద్ద సమస్యగా గుర్తించాలి. విమర్వలు ఎన్ని ఉన్నా..ఎలా ఉన్నా సమస్యలను అడ్రస్‌ చేయడంలో చిత్తశుద్ది కూడా ముఖ్యమే.

దానిని పరిష్కరించే క్రమంలో విమర్శలకు తావీయరాదు. ఎదురుదాడి విధానం సరికాదు. ఇది గుర్తెరిగా సస్యలను పరష్కరించే విధానం ముఖ్యం. పొరుగు రాష్ట్రం ఎపితో కూడా సఖ్యంగా ఉంటూ ముందుకు సాగాల్సిందే. అప్పుడే ఆమోదయోగ్య సిఎంగా కెసిఆర్‌ మరింతగా రాణిస్తారు.