పలువురికి ఆదర్శ ప్రాయంగా ఆ యువకులు
నిరుపేద యువతి,యువకుల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తూ
ఆ యువకుల గొప్ప ఆలోచనకు,పలువురి ప్రశంసల వెల్లువ
చందుర్తి మే1 (నిజం న్యూస్):
మనిషి జీవితంలో ఎదైన గొప్ప వేడుక ఉందంటే అది వివాహమే అని చెప్పచ్చు. అలాంటి మనిషి జీవితంలో జరిగే ఈ గొప్ప వేడుక జరుపుకోవడానికి అందరికీ సాధ్యంకాదు.
అలాంటి వారికోసం చేసిన ఆలోచనే ఈ మహాన్విత్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి చందుర్తి మండలానికి చెందిన వంకాయల కార్తీక్, కోనరావుపేట మండలానికి చెందిన గండి నరేష్, నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద అమ్మాయిల వివాహాలకు లేదా తల్లి తండ్రులు లేని అమ్మాయిలకు వారి స్తోమతకు, అర్హతకు దగ్గట్టుగా తగిన అబ్బాయిలను చూసి వివాహం జరిపిస్తు, ఆ వివాహానికి అండగా ఉంటూ తోచిన ఆర్థిక సహాయం చేస్తూ, దాతల సహాయ సహకారాలతో పెళ్లిళ్లు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ALSO READ: బొండాలకు తప్పని గండాలు
ఇప్పటికీ వరకు గత పదిహేను సంవత్సరాలుగా 108 జంటలను ఒక్కటి చేశాం అని అన్నారు. అదే విధంగా ఆదివారం కరీంనగర్ జిల్లాలో అనూష,కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో శరణ్య, నరేంద్ర అమ్మాయి, అబ్బాయికి పెద్దల సమక్షంలో వరపూజ కార్యక్రమం జరిపించారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ గౌడ్ మాట్లాడుతూ డబ్బులకోసం పెండ్లిల్లు చేసే ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు చూశాం కానీ, తల్లిదండ్రులు లేని అమ్మాయిలకు, నిరుపేద కుటుంబంలో జన్మించిన అమ్మాయిలకు ఇంటి పెద్దదిక్కుగా ఒక అన్నయ్యల అండగా ఉండి వివాహ సంబధం చూస్తూ, వివాహానికి వారి బ్యూరో తరుపున పూస్తే మట్టెలు, ఆర్థిక సహాయం చేయడం ఈ మహాన్విత్ మ్యారేజ్ బ్యూరోనే చేస్తున్నారని అభినందించారు.
కార్తీక్,నరేష్ చేస్తున్న పేద అమ్మాయిల వివాహల సహయలకు, నేటినుండి మేము కూడా ముందుంటం అని, మాకు చేతనైన సహాయం చేస్తూ అండగా నిలుస్థాము అని అన్నారు.
ఈ నూతన జంటకు బీజేపీ ఎన్నారై సెల్ మీడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆడపడుచు కానుకగా పట్టుచీర బహూకరించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.