హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరుకానున్నారు. రూ. 184కోట్లతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ఆసియాలోనే రెండవ అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డు కెక్కింది. కేబుల్ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్‌ను కూడా కేటీఆర్ ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు. ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలాౌ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మొత్తం రూ.184 కోట్లను దీని నిర్మాణానికి వ్యయం చేశారు. రెండేళ్ళలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీకి అప్పగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే.

Dailyhunt