Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత

తీర్పును వెల్లడించిన విజయవాడ రైల్వే కోర్టు..

2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో జరిగిన ఘటన

బాధ్యులైన ముగ్గురుపై చర్యలు తీసుకోవాలని ఆదేశం..

రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి దర్యాప్తు చేపట్టలేదని రైల్వే కోర్టు ఆగ్రహం…

సరైన ఆధారాలు లేకపోవడంతో అక్రమ కేసుగా పరిగణించి కోర్టు..

అమరావతి:మే1 నిజం న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసును కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పులు వెల్లడించింది.కాపు ఉద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది.

కాపు ఉద్యమం సందర్భంగా ఛలో తునిలో తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన రైలు దహనం ఘటనలో రైల్వే పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు.

ALSO READ: నౌలేకల్ రిజర్వుడ్ ఫారెస్టు లో అధికారుల అండదండలతో అక్రమ పైపు లైన్లు ఏర్పాటు

2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తుని సభకు తరలివచ్చిన ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెన్ ను దగ్ధం చేశారు.

దీంతో సభకు పిలుపునిచ్చిన ముద్రగడ పద్మనాభంతో పాటు 41మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై రైల్వే చట్టంలోని 146,147,153,174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఆ కేసు ను నేడు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి దర్యాప్తు చేపట్టలేదని రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.