Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నౌలేకల్ రిజర్వుడ్ ఫారెస్టు లో అధికారుల అండదండలతో అక్రమ పైపు లైన్లు ఏర్పాటు

ఆదోని మే 01 (నిజంన్యూస్) ఆదోని రేంజ్ పరిధిలో ఉన్న నౌలేకల్. రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించి కుప్పగల్ బీట్ పరిధిలో  కొందరు అక్రమంగా సంబందిత శాఖలో ఉన్న అధికారులతో కుమ్మకై ఫారెస్ట్ మధ్యలో  ఎల్ఎల్ సి కాలువ నుండి సుమారు 6 పైపు లైన్ లను అడవి మధ్యలో వేసుకోవడం జరిగిందని కొందరు స్థానికులు తెలిపారు

అడవులను రక్షించాల్సిన అధికారులే  రిజర్వుడు ఫారెస్టులో అండతో ఇలాంటి పనులను చేయిస్తే అడవులకు దిక్కెవరు ఒక వైపు కొందరు అక్రమంగా అటవీ భూములను  యతెచ్చగా  ఆక్రమించుకొని సాగుచేసుకుంటున్నారు

ALSO READ: కృష్ణాపూర్ లో హోరా హోరీగా కుస్తీ పోటీలు

అయితే వాటిపై చర్యలు చేపట్టాల్సిన కొందరు అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అక్రమాదారులతో కుమ్మకై సుమారు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం లేదంటే అటవీ భూముల మధ్యలో అంత పెద్ద మొత్తంలో పనులు జరిగినా అధికారులు చూసి చూడనట్లుగా ఎందుకు ఉన్నారంటే ఏస్థాయిలో ముడుపులు ముట్టింటాయో ఇట్టే అర్థం అవుతుంది

గత కొద్దిరోజులుగా ఈ విషయంపై సంబందిత డివిజన్ అధికారిని అడగ్గా సరైన స్పందన కూడా ఇవ్వడం లేదంటే ఈ. రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న వ్యవహారం అంతా తెలిసినట్లుగా ఉంది అంద