Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కృష్ణాపూర్ లో హోరా హోరీగా కుస్తీ పోటీలు

కుస్తీ పోటీల్లో తెలంగాణ , కర్ణాటక, మహారాష్ట మల్ల యోధులు

కల్హేర్:మే 01(నిజం న్యూస్ )కల్హేర్ కృష్ణాపూర్ గ్రామంలో గత మూడు రోజుల నుంచి దుర్గమ్మ పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మ గ్రామ దేవతల , ఉత్సవాలు జాతరలో భాగంగా సోమవారం కుస్తీ పోటీలను స్థానిక జెడ్పీటీసీ నర్సింహ రెడ్డి, సర్పంచ్ కిష్టారెడ్డి కుస్తీ పోటీలను ప్రారంభించారు .

మొదటి కుస్తీ కొబ్బరికాయ నుండి , చివరికి ఐదు తులాల వెండి కడియం వరకు , హోరాహోరీగా మల్ల యోధులు తలపడ్డారు .

ALSO READ: రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్

ఈ పోటీలలో పాల్గొనడానికి మహారాష్ట్ర కర్ణాటక తో పాటు , చుట్టుపక్కల ప్రజలు తండూప తండాలుగా వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కల్హేర్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ సింగ్, ఎంపిటిసి సుశీల అంజయ్య, ఉపసర్పంచ్ ఈశ్వర్, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్,సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు,వివిధ పార్టీల నాయకులు,వివిధ కుల వృత్తుల వారు, వివిధ యువజన సంఘాల అధ్యక్షులు, వివిధ,గ్రామ యువత గ్రామ పెద్దలు వివిధ గ్రామాల మల్లయుదులు సంఖ్యలో పాల్గొన్న