Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుంగభద్ర రైల్వే స్టేషన్ లో ఏడు నెలల బాలుడు అదృశ్యం

 

(కర్నూలు జిల్లా) మంత్రాలయం ఏప్రిల్ 30 నిజం న్యూస్

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది

వివరాలు ఈ విధంగా ఉన్నాయి కచాపురం గ్రామానికి చెందిన అంజి అంకమ్మ దంపతులు పాత రైల్వే స్టేషన్ లో పాన్పు పై నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఏడు నెలల బాలుడు రామును అపహరించారు

ALSO READ: కెసిఆర్ సర్కారులో రైతులకు భరోసా లేదు

అది గమనించిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో విచారించగా కనిపించకపోవడం తో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఈ ఫిర్యాదు మేరకు ఆదోని రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని విచారి విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు బాబును అపహరించినట్లు గుర్తించి ప్రత్యేకమైన బలగాలను ఏర్పాటు చేసి విచారణ మరింత వేగవంతం చేశారు