Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కెసిఆర్ సర్కారులో రైతులకు భరోసా లేదు

– వైఎస్సార్ పార్టీ షర్మిల

బోనకల్ ఏప్రిల్ 30 (నిజం న్యూస్ ) కేసీఆర్ సర్కారులో రైతులకు భరోసా లేదని వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం లో వర్షాలకు పంట నష్టం జరిగిన మొక్కజొన్న పొలాలను ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు .అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు .

ALSO READ: కుత్బుల్లాపూర్ డివిజన్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

మార్చి, ఏప్రిల్ నెలలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే కేసీఆర్ ఇంతవరకు పంట నష్టపరిహారం సక్రమంగా అందజేయలేదని విమర్శించారు. కేసీఆర్ కళ్ళప్పగించి ఫార్మ్ హౌస్ లో మత్తుగా పండుకుంటున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు .

ఇది దిక్కుమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వం అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు భరోసా ఉండేదని గుర్తు చేశారు. తొమ్మిది సంవత్సరాల నుంచి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదన్నారు. ప్రతి ఏడాది రైతు నష్టపోతునే ఉన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సచివాలయానికి ఎందుకు అంత ఖర్చు అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కి ప్రజలను నమ్మి ఓట్లు వేస్తే తెలంగాణ తల్లికి ద్రోహం చేశాడన్నారు