కుత్బుల్లాపూర్ డివిజన్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు
కుత్బుల్లాపూర్ డివిజన్లో జోరుగా అక్రమ నిర్మాణం.
*మాకు నచ్చినట్లు అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తాం—- టౌన్ ప్లాన్ అధికారులు.
*కుత్బుల్లాపూర్ 131 డివిజన్ లో అక్రమంగా సెల్లార్..
*జిహెచ్ఎంసికి భారీగా గండి కొడుతున్న వైనం.
*ఇష్ట రాజ్యాంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది.
*అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు.
కుత్బుల్లాపూర్: ఏప్రిల్ 30 (నిజం న్యూస్) అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తామన ప్రగల్పిలు పలుకుతున్న నేతలు హామీలు గాలిలో మెడలో వెలుస్తున్నాయి. నిబంధనలను ఎవరు అతిక్రమించిన, ఎంతటి వారైనా ఉపాక్షించేది లేదని బల్ల గుద్ది చెబుతున్న అధికారులు బల్ల ల కింద చేతులు చూస్తున్నారు.
అక్రమ నిర్మాణం దారులకు అండదండలు అందిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ సర్కిల్ 25 కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎయిడ్స్ కన్నా భయంకరమైన అవినీతి రోగం వ్యాపిస్తుంది. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణ దారులకు అడ్డదారిలో అనుమతులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ: ఐఐటీ జేఈఈ జాతీయస్థాయి ర్యాంకు సాధించిన వరుణ్ సందేశ్
అంతేకాకుండా అడిగినంత ఇస్తే అన్ని సక్రమే అని విధంగా అధికారులు వ్యవహరిస్తున్నా తీరు విశ్వయానికి గురి చేస్తోంది. అవినీతిని పూర్తిగా నిరుపేదించేందుకు నూతన వ్యవస్థను తీసుకు వస్తానని అంటున్న ప్రభుత్వం ప్రకటనలతో అప్రమత్తమైన కొందరు అధికారులు నూతన దారులు వెతుకుతున్నారని సమాచారం ఆ దిశగా సర్కిల్స్ సిబ్బంది చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని నిర్మాణదారులకు అనుమతులు మంజూరు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ 25 పరిధిలోని సాగర్ ఎంక్లవే సూర్య నగర్ చింతల్ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లు వెలుస్తున్న అక్రమ నిర్మాణం లపై ఉన్నత అధికారులు సైతం ఎలాంటి ఊసు ఎత్తడం లేదు.
అవినీతికి పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. జి ప్లస్ టు వరకు అనుమతులు తీసుకొని సెల్లార్ నుండి ఐదు అంతస్తుల వరకు నిర్మాణం చేపడుతున్న సిబ్బంది ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటే ఏ మేరకు అవినీతి జరుగుతుందో బల్దియా ఆదాయానికి ఎంత గండి కొడుతున్నారో అర్థమవుతుంది.
తూతూమంత్రంగా ఒకవైపు తాత్కిలి కంగా డ్యామేజ్ చేస్తూ మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు తెర లేవతున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై ఉన్నత అధికారులు దృష్టి సాధించాలని స్థానికులు కోరుతున్నారు.