Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధి కోసం ఊరు వదలాల్సిందే

పట్టణాల్లో భవన కార్మిక కూలీలుగా జీవనం
హోటళ్లు, పెట్రోల్‌ బంకుల్లో వెట్టిచాకిరీ
విజయనగరం,ఏప్రిల్‌30(ఆర్‌ఎన్‌ఎ): విజయనగరం జిల్లాలోని ఏ గ్రామానికి వెళ్లినా వలస బాధితుల దయనీయ గాధలు వినిపిస్తారు. ఊరిలో వృత్తి పనిలేక ఉపాధి దొరక్క వలస పోతున్నారని, అక్కడ ఆరేడు మాసాలు మట్టి పనులు చేసి, కొద్దిగా డబ్బులు కూడబెట్టుకొని ఊరికి తిరిగి రావడం గ్రామంలో ఆనవాయితీ. ఉపాదిహావిూ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి కూడా కనీస వేతనం అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రోజురోజుకీ వలసలు పెరుగుతున్నాయి.

ఎక్కువమంది గ్రామంలో పని దొరక్క వలస పోతున్నారు. జిల్లాలో వలసల నివారణకు తగిన చర్యలు తీసుకోక పోవడంతో ఉపాధి కోసం అనేక కుటుంబాలు ఊరొదిలి వెళ్లారు. ఇల్లు గడవక అనేక కుటుంబాలు పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలసపోయాయి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను ఇళ్లకు కాపలా పెట్టి, ఉపాధి కోసం ఊరి వదిలిపోతున్న కుటుంబాలు ఇప్పుడు కరోనా దెబ్బ.. మళ్లీ సొంతూళ్లకు రావడం పెరుగుతున్నాయి.

ALSO READ: సింగరేణి కార్మికుల శ్రమదోపిడీ

వీరు ఇప్పుడు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది ఇలాగే వెళ్లిన వారు తిరిగి ఊళ్లకు చేరారు. మధ్యలో మళ్లీ ఉపాధి కోసం పట్టణాలకు చేరారు. తిరిగి సెకండ్‌వేవ్‌తో ఇప్పుడు సొంతూళ్లకు చేరుతున్న వారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. హావిూ పథకం అమల్లో ఉన్నా తగిన ఆదరణ లేక జిల్లాకు వలసల బెడద పట్టుకుంది.

హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వంటి పట్టణాల్లో పనుల కోసం వెళ్లి, అక్కడ భవన నిర్మాణ కార్మికులుగానో, ఇటుకల తయారీ బట్టీల్లోనో, ఇతర పనుల్లో కూలీలుగా పనిచేసేవారు. ఇలా జిల్లాలో ఏ మూలకు వెళ్లినా వలస బాధితులు తారసపడుతూనే ఉంటారు.

వర్షపాతం బాగానే ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు లేక జిల్లాలో వ్యవసాయ పనులు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. మరోవైపు వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం, పంట భూములన్నీ రియల్‌ఎస్టేట్‌గా మారిపోవడంతో వ్యవసాయాధారిత జిల్లాగా పేరొందిన విజయనగరం ప్రస్తుతం వలసల జిల్లాగా మారి పోయింది.

దీనికి తోడు జిల్లాలో జ్యూట్‌, ఫెర్రోఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతబడి వేలాది కార్మికకుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యం లోనే జిల్లాలో గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, బాడంగి, తెర్లాం మండలాల్లో అత్యధిక కుటుంబాలు ఏటా వలస పోతున్నాయి.

ఏడాదిలో ఆరేడు నెలలు పనులు చేసి, నాలుగు రూపాయలు పోగేసుకుని సొంత ఊళ్లకు రావడం పరిపాటిగా మారింది. కొంతమంది అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క మైదాన ప్రాంతాలే కాదు. ఇటీవల ఉపాధి లేక ఏజెన్సీలోనూ వలసలు పెరిగాయి.

డిగ్రీలు, పీజీలు చేసిన గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో
పట్టణాలకు వలసపోయి హోటళ్లలో వెయిటర్లు గానూ, క్లీనింగ్‌ బారులగానూ పనులు చేసేవారు. కొన్నిసార్లు అక్కడ జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి కన్నవారికి అనాధలుగా మార్చేస్తున్న ఘటనలు ఉన్నాయి.