Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సింగరేణి కార్మికుల శ్రమదోపిడీ

బొగ్గు లేకుంటే థర్మల్‌ విద్యుత్‌ లేదు
కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేయాలి
రామగుండం,ఏప్రిల్‌30: మేడే అనగానే తెలంగాణలో సింగరేణి, ఆర్టీసీ కార్మికులే గుర్తుకు వస్తారు. అనేక సంస్థలు ఉన్నా ఈ రెండు సంస్థల్లో కార్మికులకు ఇంకా న్యాయం జగాల్సి ఉంది. శ్రమదోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసి ఆ వ్యవస్థనే రద్దు చేస్తామని ఇచ్చిన హావిూ మేరకు సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలి.

శ్రమదోపిడీకి గురవుతున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులను ఆదుకుని వారికి ఉద్యోగ భరోసా కల్పించాలి.కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ఎలాగూ హావిూ ఇచ్చారు కనుక కోల్‌ ఇండియాలో జరిగిన ఒప్పందాలను సింగరేణిలో అమలు చేయాల్సి ఉంది.

ALSO READ: కార్మికుల చట్టాల అణచివేత దుర్మార్గం 

ప్రధానంగా సింగరేణి కార్మికుల వల్లనే ఇవాళ బొగ్గు ఉత్పత్తి జరిగి విద్యుత్‌ రంగానికి కీలక భూమికను నిర్వహిస్తున్నారు. వీరు లేకుంటే థర్మల్‌ పవర్‌ లేదన్నది గుర్తించాలి. వృత్తిగతంగా అనేక సమస్యలు ఎదుర్కొం టున్నారు. ఇందులో ఆరోగ్య సమస్య అతి ప్రధానమైనది. బొగ్గుబావుల్లో దిగి తమ ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికి తీస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పోరాటం మరువలేనిది. ప్రపంచ కార్మిక దినోత్సవం స్ఫూర్తితో కార్మికులు మరింతగా ఉత్పత్తి క్షేత్రంలో పనిచేసేలా ప్రభుత్వం ఆదుకో వాల్సి ఉంది. సింగరేణి యాజమాన్యం వేతన ఒప్పందాలను, కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మిక హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అలాంటివి లేకుండా ఆదాయవనరుగా ఉన్న కార్మికులను ఆదుకోవాల్సి ఉంది.

కోల్‌ బెల్ట్‌లో గెలిచిన టిఆర్‌ఎస్‌ ఎంపీలు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందు నిలబడాలి. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సి ఉంది. సింగరేణిలో కొత్త బావులు విస్తరస్తామని, ఉపాధి పెంచుతామని, కార్మిక హక్కుల కాపాడుతామని ఇచ్చిన హావిూలు అమలు కావాల్సి ఉంది.అలాగే వారసత్వ ఉద్యోగాలు ఇంకా అందని ద్రాక్షగా మిగిలింది.

ALSO READ: రాహుల్ గాంధీకి శిక్ష పడితే మాట్లాడలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నేతలు

సింగరేణిలో పనిచేసి బయటకు వచ్చిన కార్మికులు మళ్లీ ఏ పనీ చేయలేని స్తాయిలో నిసత్తువ కలిగి ఉంటారు. వారిని ఉత్పాదక శక్తిగా గుర్తించి ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించి
ఆదుకోవాలి. కొత్త బొగ్గుబావుల విస్తరణతోనే ఉద్యోగాలు సృష్టించ బడతాయి. అప్పుడే సింగరేణి మనుగడ కొనసాగుతుంది. కార్మికుల సంక్షేమంపై సింగరేణి యాజమాన్యం దృష్టిసారించాలి.

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పత్తి పెరుగుతుందని గుర్తించాలి. ఇప్పటికైనా సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని కార్మికులు కోరుకుంటున్నారు.

కోల్‌ ఇండియా ఒప్పందాలను అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలను యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.