Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్మికుల చట్టాల అణచివేత దుర్మార్గం 

కార్మికుల పోరాటాల్లో నుంచి మేడే పుట్టినా…నిత్యం వారికే అన్యాయం జరుగుతోంది.

వారినే యాజమా న్యాలు చులకన చేస్తున్నాయి. ఏటా మేడేలు జరుపుకుంటున్నా స్వేదం చిందిస్తున్న కార్మికులను ఇంకా బానిసలుగా చూస్తున్న ఘటనలు కోకొల్లలు. మిద్దెలు,మేడెలు కడుతున్నా..వారికి గూడు ఉండడం లేదు.

వ్యవసాయం నుంచి అన్నిరంగాల్లో వారి చెమట లేకుండా ఏ పనీ జరగడం లేదు. సర్వసంపదలు సృష్టించే శ్రామిక వర్గం అన్నది గుర్తింపు లేకుండా పోయింది. శ్రమజీవులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా ఏమిటో చాటారు.

మేడే అనగానే గుర్తుకు వచ్చేది కార్మిక వర్గమే. వారు లేనిదే పరిశ్రమలు లేవు..జీవనం లేదు.. అయినా ఏటా మేడేలు జరుపుకుంటున్నా వారిని ఆదరించే తీరులో మాత్రం చిత్తశుద్ది కానరావడం లేదు. వారిని నేటికి బానిసలు గానే చూస్తున్న తీరు దారుణం. కార్మిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

చట్టాలు పరిశ్రమల యాజమాన్యాలకు చుట్టాలుగా మారుతున్నాయి. కనీస వేతనాలు, అమలు కావడం లేదు. పనిదినాలు, పనిగంటలు అననవి లేకుండా పోతున్నాయి. దేశంలో కార్మికులను అణచివేసే రాక్షస యాజమాన్యాలకే ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి.

ALSO READ: రాహుల్ గాంధీకి శిక్ష పడితే మాట్లాడలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నేతలు

వారికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్న కారణంగా, కార్మికసంక్షేమం అన్నది మేడిపండు చందంగా మారింది. కార్మికులు తమ స్వేదాన్ని రక్తంగా చిందించి లాభాలు తెచ్చి పెడుతున్నా, నేటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదు.

ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్నా.. నేటికీ అవి అమలు కావడం లేదు. 8 గంటల పని హక్కు కోసం ఆనాటి ప్రభుత్వాల మెడలు వంచి పని గంటల హక్కు సాధించారు.

తమ హక్కుల సాధన కోసం వందలాది మంది ప్రాణాలర్పించారు. పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. తమ డిమాండ్లపై నినదించిన వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగస్తున్నారు. ఉద్యోగా లు తొలగించినా… నోటీసులు ఇవ్వకున్నా కార్మిక సంక్షేమ శాఖ చూసీచూడనట్లుగా ఉంటోంది.

కార్మికుల పిల్లలకు విద్యా,ఉద్యోగ సౌకర్యాల కల్పన లేదు. వారికి ఆరోగ్య సమస్యలపై పెద్దగా స్పందించడం లేదు. అలాగే అర్థాంతరంగా కంపెనీలను, సంస్థలను మూసేసి కార్మికలు నోట్లో మట్టి కొడుతున్నా చట్టాలు పనిచేయడం లేదు. నేటికీ ఇంకా ఫ్యూడల్‌ భావాల నుంచి యాజమాన్యాలు బయటపడడం లేదు.

మారిన ప్రపంచ పటంలో మారుతున్న కాలంలో ఇంకా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కార్మికులను అణచివేసేందుకు యాజమాన్యాలు కొత్తకొత్త పద్దతులను అనుసరిస్తున్నాయి. యాజమాన్యా లకు వత్తాసు పలికే బూర్జువా విధానానలను ప్రభుత్వాలు విడనాడాలి. అప్పుడే మేడేకు సార్థకత చేకూరు తుంది.

ALSO READ: రాహుల్ గాంధీకి శిక్ష పడితే మాట్లాడలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నేతలు

పారిశ్రామికీకరణ తరవాత కూడా మార్పులు రావడం లేదు. కార్మాకులకు హక్కులు లేకుండా చేస్తున్న యాజామన్యాలకు అనుగుణంగా చట్టాలు తీసుకుని రావడం దారుణం. ఈ పరిస్థితులనుంచి బయటపడాలి. పక్కాగా శ్రామిక చట్టాలు అమలు చేసి వారికి అండగా నిలవాలి. కార్మిక హక్కులు, పోరాటాలు, త్యాగంతోనే సాధ్యం అయ్యాయి.

కానీ ప్రభుత్వాలు కార్పోరేట్‌ కంపెనీల మోచేతి నీళ్లు తాగుతూ..కార్మికులకు ద్రోహం చేస్తున్నాయి. కనీస పనిగంటు, కనీస వేతనాలు అమలు కావడం లేదు. వాటిని అమలు చేయాల్సిన యాజమాన్యాలు ఇంకా తమ బానిస భావన నుంచి బయటపడడం లేదు. కార్మికవర్గం లేకుంటే తమకు పురోగతి లేదన్న భావనలో లేరు.

పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో కార్మికులను బానిసల వలే పని చేయించారు. కార్మికులు రోజుకు 16 నుంచి 20 గంటల వరకు పని చేసేవారు. అయితే చైతన్యం పెరగడంతో మెల్లగా 19వ శతాబ్దం ప్రారంభం నుంచి కార్మికులు తిరుగుబాట్లు ప్రారంభించారు. ఆనాడు కార్మికులకు ఎటువంటి భద్రత గాని, సౌకర్యాలు గాని వుండేవి కాదు.

ఫ్యాక్టరీల్లో
గాలి, వెలుతురు సౌకర్యాలు మృగ్యం. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ లేదు. తరచుగా ప్రమాదాలకు గురై మరణించే వారు. కార్మికులు అమానుష శిక్షలకు గురవుతుండేవారు. కార్మికులు తమ పీడనకు వ్యతిరేకంగా యంత్రాలను ధ్వంసం చేసేవారు. ఈ విధ్వంసకాండ బ్రిటన్‌లో ప్రారంభమైంది. యంత్రాలను విచ్ఛిన్నం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ బ్రిటన్‌లో చట్టం చేసారు.

ఈ దుస్థితి నుంచి బయట పడడానికి పోరాటం సల్పడం ఒక్కటే మార్గమని కార్మికవర్గం అర్ధం చేసుకుంది. కార్మిక వర్గం చైతన్యవంతంగా వున్న దేశాల్లో ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం ప్రారంభ మైంది. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియా కార్మికులు సమ్మె చేశారు.

ఫిలడెల్ఫియా నగరంలో ’మెకానిక్స్‌ యూనియన్‌’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో కార్మికులు సంఘాలను నిర్మించుకొని పోరాటాలు సాగించారు. ట్రేడ్‌ యూనియన్ల మహత్తర శక్తిని చూసి పాలకులు హడలెత్తిపోయారు. 1886 చికాగో కార్మికుల పోరాటం,884 అక్టోబర్‌లో అమెరికా, కెనడాల ఆర్గనైజ్డ్‌ ట్రేడ్‌ అండ్‌ లేబర్‌ యూనియన్ల నాలుగవ మహాసభ జరిగింది.

ALSO READ: కల్మలచెరువు వాసి సైదులు ప్యారా వాలీబాల్ భారత టీం కి ఎంపిక

1886 మే నుండి 8 గంటల పని చట్టబద్దమైన పనిదినంగా వుంటుందని తీర్మానం చేసింది. మే 1వ తేదీన సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చింది. ’మనిషి జీవితంలో రోజులో 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య’ అనే శాస్త్రీయ పద్ధతి కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ పిలుపుకు అశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది కార్మికులు అనేక సంస్ధలు ’8 గంటల పని దినం’ కోసం మే1వ తేదీన సమ్మెలో పాల్గొన్నారు.

1889లో ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్‌ మొదటి కాంగ్రెస్‌ మేడేను అంతర్జాతీయ కార్మికదినంగా అమలు చేయాలని తీర్మానాన్ని రూపొందించింది. అప్పటి నుంచి మేడేను అధికారికంగా కార్మికలోకం జరుపు కుంటోంది.

ఆతరవాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కార్మికవర్గ కార్యక్రమాలు బాగా పెరిగాయి. ఈ అనుభవాను గుర్తించినా రానురాను ఈ ఆధునిక యుగంలో కార్పోరేట్‌ కంపెనీలన్నీ ప్రభుత్వాలతో కుమ్మక్కయి కార్మికులను అణచి వేస్తున్నారు. ఈ క్రమంలో మరో కార్మికోద్యమానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మేల్కొని అప్రమత్తంగా ఉండాల్సిందే.